Share News

నిష్పక్షపాతంగా విధులను నిర్వహించాలి

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:30 AM

గ్రామ పంచాయతీ ఎన్నికలలో అధికారులు తమ ఎన్నికల విధులను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

నిష్పక్షపాతంగా విధులను నిర్వహించాలి

సిరిసిల్ల, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికలలో అధికారులు తమ ఎన్నికల విధులను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. గురువారం జిల్లా సమీకృత కార్యాలయాల సము దాయంలోని ఆడిటోరియంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, జోనల్‌ అధికారులకు జిల్లా సాధారణ, వ్యయ పరిశీలకులు పీ రవి కుమార్‌, కే రాజ్‌ కుమార్‌తో కలిసి ఇన్‌చార్జి కలెక్టర్‌ ఎన్నికల వ్యయ వివరాల నమోదు, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై తీసుకో వాల్సిన చర్యలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్కరికి సమానమైన హక్కు కల్పిస్తూ పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ఎలాంటి రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది పాల్గొన కూడదని స్పష్టం చేశారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు ఎన్నికల సమయంలో జరుగుతున్న ఉల్లంఘనలను, నగదు, మద్యం పంపి ణీని గుర్తించడం, రిపోర్ట్‌ చేయడం ఆధారాలు సేకరించడం, రికార్డు చేయ డం చాలా కీలకమని అన్నారు. ఎన్నికల సమయంలో అక్రమ నగదు సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. విధుల్లో భాగంగా ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌, స్టాటిక్‌ సర్వలెన్స్‌ బృందాలు నగదు, ఇతర ఆభరణాలు సీజ్‌ చేసినప్పుడు తప్పనిసరిగా వీడియో ఫుటేజ్‌ తీసుకోవాలని, ఏమాత్రం నిర్లక్షం ప్రదర్శించవద్దని సూచించారు. ఎన్నికల కు సంబంధించి అక్రమ నగదు, మద్యం పంపిణీ అరికట్టడమే మన లక్ష్య మని, సాధారణ ప్రజలకు అసౌకర్యం కలగకుండా వీలైనంత వరకు జాగ్రత్తలు వహించాలని అన్నారు. నగదు సీజ్‌ చేసే సమయంలో ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని, నగదు సీజ్‌ చేసే సమయంలో ఎక్కడ అప్పీల్‌ చేయాలనే అంశం స్పష్టంగా తెలియజేస్తూ రశీదు అందించాలని అన్నారు. ర్యాలీలను పరిశీలించాలని, వినియోగించిన వాహనాలు, భోజనాలు తదితర ప్రతి అంశాన్ని పరిశీలిం చి వివరాలు నమోదు, రికార్డ్‌ చేయాలని సూచించారు. అక్రమ నగదు, మద్యం పంపిణీ జరగకుండా జాగ్రత్తలు వహించాలని, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై అప్రమత్తంగా ఉంటూ ఆధారాలు సేకరించాలని సూచిం చారు. రూ 50 వేల కంటే ఎక్కువ డబ్బు తరలిస్తే పట్టుకొని, వీడియో తీసి పంచనామా చేయాలని, అనంతరం పట్టుకున్న డబ్బుకు సంబంధించి రసీదు అందజేయాలని సూచించారు. ఎన్నికల ప్రచారం, ర్యాలీలకు అను మతి ఇవ్వడం, వాటిని పరిశీలించడం, ఖర్చుపై వివరించారు. ఈ సమా వేశంలో నోడల్‌ అధికారులు శేషాద్రి, భారతి, జడ్పీ డిప్యూటీ సీఈవో గీత, డీపీఓ షరీఫోద్దిన్‌ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2025 | 12:31 AM