చట్టాలపై అవగాహణ కలిగిఉండాలి
ABN , Publish Date - May 25 , 2025 | 12:07 AM
చట్టాలపై ఖైదీలు అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి కె వెంకటేశ్ అన్నారు. కరీంనగర్ జిల్లా జైలులో ఖైదీలకు భోజన వసతితో పాటు ఇతర మౌలిక వసతులను శనివారం ఆయన పరిశీలించారు.

కరీంనగర్ క్రైం, మే 24(ఆంధ్రజ్యోతి): చట్టాలపై ఖైదీలు అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి కె వెంకటేశ్ అన్నారు. కరీంనగర్ జిల్లా జైలులో ఖైదీలకు భోజన వసతితో పాటు ఇతర మౌలిక వసతులను శనివారం ఆయన పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి భోజనం, యోగక్షేమాలు, న్యాయ సేవలు, ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శిక్షలు పడిన ఖైదీలు హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ఆసక్తి కలిగిన వారి వివరాలను తెలసుకున్నారు. ప్రైవేట్ న్యాయవాదిని నియమించుకునేందుకు స్థోమత లేనివారికి న్యాయసహాయం కోసం ప్రభుత్వ న్యాయవాదిని నియమస్తామని చెప్పారు. అనంతరం జైలులోని క్యాంటిన్, ఆసుపత్రి, ములాఖత్ గది, లైబ్రరీ, వంటశాల, జైలులోని ఇండస్ట్రీలను ఆయన పరిశీలించి, పనితీరు బాగుందని అభినందించారు. మహిళా జైలును సందర్శించి మహిళా ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ జి విజయ్‌డేని, జైలర్లు పి శ్రీనివాస్, బీ రమేష్, డిప్యూటీ జైలర్‌లు ఎ శ్రీనివాస్‌రెడ్డి, ఎల్ రమేష్, లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ లాయర్లు తనుకు మహేష్, టి పరుశరాం, ఎస్ మల్లేశం, అసిస్టెంట్ డిప్యూటీ జైలర్లు, జైలు గార్డింగ్ సిబ్బంది, ఖైదీలు పాల్గొన్నారు.