చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
ABN , Publish Date - Nov 23 , 2025 | 12:31 AM
ప్రతీ ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిట్టూరి రత్న పద్మావతి తెలిపారు.
- జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి
మల్లాపూర్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రతీ ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిట్టూరి రత్న పద్మావతి తెలిపారు. మెట్‌పల్లి మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శనివారం మల్లాపూర్ మోడల్ స్కూల్లో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని చట్టపరమైన ఆయా ఆంశాలను వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటూ తల్లిదండ్రులకు, గురువలుకు మంచి పేరు తీసుకరావాలని సూచించారు. వృద్ధులను వారి పిల్లలు పోషించడం చట్టపరమైన బాధ్యత అన్నారు. ముందుగా పాఠశాలలో రుద్ర బుచ్చిరాజం స్మారకార్థం నిర్మించిన సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు నారాయణ, నాగేశ్వర్‌రావు, అరుణ్‌కుమార్, పావని, డీఎస్పీ రాములు, జిల్లా విద్యాధికారి రాము, మెట్‌పల్లి బార్ అసోసియేషన అధ్యక్షుడు కంతి మోహనరెడ్డి, న్యాయమూర్తుల, పోలీసులు పాల్గొన్నారు.
సీనియర్ సిటిజన్స చట్టాన్ని ఉపయోగించుకోవాలి
జగిత్యాల టౌన, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): సీనియర్ సిటిజన్స సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరిస్తామని, వారి హక్కుల పరిరక్షణకు చట్టాన్ని ఉపయోగించుకోవాలని జిల్లా జడ్జి వెంకట మల్లిక్ సుబ్రమణ్య శర్మ సూచించారు. జిల్లా కేంద్రంలోని పెన్షనర్ల భవనంలో శనివారం టీఎస్‌జీఆర్‌ఈఏ కార్యవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా జడ్జి వెంకట మల్లిక్ సుబ్రమణ్య శర్మ పాల్గొని సీనియర్ సిటిజన్స సమస్యలు పరిష్కారం, హక్కులపై చట్టబద్ద అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ సీనియర్ సిటిజన్సకు న్యాయపరమైన సలహాలు సూచనలకోసం జిల్లా జ్యుడీషియల్ సిబ్బంది తగిన మార్గదర్శనం చేస్తారని తెలిపారు. సభ్యులు అడిగిన గిఫ్ట్ డిడ్, సైబర్ క్రైంతో పలు సందేహాలపై సీనియర్ న్యాయవాది బండ భాస్కర్ రెడ్డి వివరించారు. సీనియర్ సిటిజన్సకి ఎలాంటి సమస్య వచ్చినా చట్టబద్దతతో పరిష్కరించేందుకు సహకరిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోషియేషన జిల్లా అధ్యక్షుడు కరబుజ రవీందర్, ప్రధాన కార్యదర్శి కొలిచాల రవీందర్, అసోషియేటేడ్ అధ్యక్షుడు ఎ అశోక్‌రావు, గుండేటి గంగాధర్, ఎస్. గంగారాం, ముద్దం కనకతార, కొప్పుల వెంకటరమణ, పట్టణ విభాగం అధ్యక్ష్యప్రధానకార్యదర్శులు మెట్ట మల్లికార్జున, కంటే అంజయ్య, ఆర్థిక కార్యదర్శి వెల్పుల ప్రతాప్, ఒరుగంటి ప్రభాకర్‌రావు, కార్యవర్గ సభ్యులు, సీనియర్ సిటిజన్స తదితరులు పాల్గొన్నారు.