Share News

మున్సిపల్‌ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలి

ABN , Publish Date - Dec 02 , 2025 | 11:38 PM

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికులకు కనీస వేతనాలను 26 వేల రూపాయలు చెల్లించాలని తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు డిమాండ్‌ చేశారు.

మున్సిపల్‌ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలి
మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్మికులు

కరీంనగర్‌ టౌన్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికులకు కనీస వేతనాలను 26 వేల రూపాయలు చెల్లించాలని తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు డిమాండ్‌ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కార్మికులు చాలీచాలని వేతనాలతో జీవితాలను నెట్టుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేషన్‌లో పనిచేస్తున్న కార్మికులందరికి బీమా వర్తింపజేయాలని, జిల్లా కేంద్రంలో ఈఎస్‌ఐ వంద పడకల హాస్పిటల్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌ వేణుమాధవ్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో మహిళా సబ్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ ముక్కెర బుజ్జమ్మ, జిల్లా నాయకుడు కంపెల్లి పోచయ్య, కార్పొరేషన్‌ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మనుపాటి మల్లేశం, దేవునూరి శ్యాంసుందర్‌, దాసరి రాజమల్లయ్య, బరిగెల చంద్రయ్య, జంగం రవీందర్‌, పురుషోత్తం రాణి, మెరుగు సంపత్‌, శంకర్‌, చంద్రకళ, రామగిరి శ్యామ్‌, కలవాల సిద్దు, కొంకటి రాములు పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2025 | 11:38 PM