పంచాయతీ ఎన్నికలతోనే ముందుకు..
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:12 AM
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలా, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలా అనే విషయమై డైలామాలో ఉన్న ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలతోనే ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు కనబడుతోంది. ఆ మేరకు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలా, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలా అనే విషయమై డైలామాలో ఉన్న ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలతోనే ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు కనబడుతోంది. ఆ మేరకు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీల పాలక వర్గాల 2024 ఫిబ్రవరి మొదటి వారంలో ముగియగా, మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీ కాలం గత ఏడాది జూన్, జులై మాసాల్లో ముగిసింది. ఈ ఎన్నికలను సకాలంలో నిర్వహించని కారణంగా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడడంతోపాటు పరిసరాల పరిశుభ్రత, పారిశు ధ్యం లోపిస్తున్నది. ప్రత్యేక అధికారుల పాలన నడుస్తు న్నప్పటికీ, స్థానిక సంస్థలకు నిధులు లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులను నిలిపి వేయడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బిల్లుతో పాటు, 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ తీసుకవచ్చిన ఆర్డినెన్స్ గవర్నర్‌కు పంపిం చగా ఆయన రాష్ట్రపతికి పంపించారు. వాటిని ఆమో దించే విధంగా రాష్ట్రపతిపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల మొదటి వారంలో సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీలో మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి జనాభా లెక్కలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ లెక్కలతోపాటు బీసీ కులగణన కూడా చేస్తామని ప్రకటించింది. ఇది పూర్తయ్యే వరకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యే పరిస్థితి లేదు. ప్రభు త్వపరంగా జీవో తీసుక రావాలని రాష్ట్రం భావిస్తున్నది. అలా కాని పక్షంలో పార్టీ పరంగానైనా 42 శాతం బీసీ నాయకులకు టిక్కెట్లు ఇవ్వాలని అధికార పార్టీ భావి స్తున్నది. వచ్చే నెల మొదటి వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నది.
ఫ 2న ఓటర్ల తుది జాబితా..
గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసేం దుకు షెడ్యూల్ ప్రకటించింది. ఆ మేరకు ఈ నెల 28న జిల్లాలోని 263 గ్రామ పంచాయతీల పరిధిలో 2432 వార్డులు ఉన్నాయని, వార్డుల వారీగా ఓటర్ల జాబితా లను గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యా లయాల్లో ప్రచురించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్లు 4,04,209 ఉండగా, పురుషులు 1,98,744 మంది, మహిళలు 2,05,451 మంది, ఇతరులు 14 మంది ఉన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి 31వ తేదీన పరిష్కరించనున్నారు. సెప్టెంబర్ 2న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ఓటర్ల జాబితాలపై శుక్రవారం జిల్లా స్థాయిలో కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. 30న మండల స్థాయిలో నాయకులతో సమావేశం నిర్వహిం చనున్నారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు కావాల్సిన పోలింగ్ బాక్సులు గుజరాత్ రాష్ట్రం నుంచి జిల్లాకు తీసుకవచ్చారు. ఓటర్ల తుది జాబితా ప్రకటించిన వారం రోజుల్లోనే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారా అని అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు బీఆర్‌ఎస్, బీజేపీ, తదితర పార్టీలకు చెందిన నాయకులు, తటస్తులు ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికలు పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా నిర్వహించనుండడంతో పోటీ చేసే వారి సంఖ్య గతంలో కంటే పెరిగే అవకాశాలున్నాయి.