శిశు సంరక్షణపై తల్లులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:44 PM
ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి నవజాత శిశు సంరక్షణ, పోషకాహారంపై తల్లులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ సూచించారు. మంగళవారం నగరంలోని మోతాజ్‌ఖానా అర్బన్ హెల్త్ సెంటర్‌ను ఆయన సందర్శించారు.
సుభాష్‌నగర్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి నవజాత శిశు సంరక్షణ, పోషకాహారంపై తల్లులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ సూచించారు. మంగళవారం నగరంలోని మోతాజ్‌ఖానా అర్బన్ హెల్త్ సెంటర్‌ను ఆయన సందర్శించారు. ఆశా కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న పిల్లల ఆరోగ్య సమస్యలను గుర్తించడంలో తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. 30 సంవత్సరాలపై వారందరికి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. బీపీ, షుగర్ నిర్దారణ అయిన వారికి మందులను వారికి అందజేయాలన్నారు. ఆరోగ్య మహిళ క్యాంపుల్లో మహిళల రీస్ర్కీనింగ్ వంద శాతం పూర్తి చేయాలన్నారు. తీవ్ర పోషక ఆహార లోపం ఉన్న, బరువు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించి జిల్లా పునరావాస కేంద్రానికి పంపించాలన్నారు. కార్యక్రమంలో ఎన్‌సీడీ పీవో డాక్టర్ ఉమాశ్రీ, ఎంహెచ్‌ఎన్ పీవో డాక్టర్ సన జవేరియా, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఇమ్రాన్ పాల్గొన్నారు.