ప్రభుత్వ వైద్యంపై మరింత నమ్మకం కల్గించాలి
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:10 AM
ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించి పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ సిబ్బందికి సూచించారు.
మానకొండూర్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించి పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ సిబ్బందికి సూచించారు. మానకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 36 గంటల్లో ఐదు సాధారణ ప్రసవాలు చేసిన పీహెచ్‌సీ సిబ్బంది పని తీరు బాగుందని ప్రశంసించారు. బాలింతలను పిహెచ్‌సీలోని సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యుడు ఎండీ సల్మాన్‌తోపాటు సిబ్బంది, బాలింతలను సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎంహెచ్‌వో వెంకటరమణ మాట్లాడుతూ మానకొండూర్ పీహెచ్‌సీలో 36 గంటల్లో ఐదు సాధారణ ప్రసవాలు చేయడం అభినందనీయమన్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జనవరి నుంచి 222 సాధారణ ప్రసవాలు జరిగినట్లు ఆయన తెలిపారు. మహిళలు గర్భం దాల్చిన నుంచి ప్రసవమయ్యే వరకు వైద్యుల సూచనలు, సలహాలు పాటించాలన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రభుత్వ వైద్యాన్ని సధ్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్‌వో రాజగోపాల్, ప్రత్యేకాధికారి సనా, పీహెచ్‌సీ వైద్యులు ఎండీ సల్మాన్, రాజ్‌నాయక్ పాల్గొన్నారు.