Share News

సంఘం అభివృద్ధికి మరింత కృషి

ABN , Publish Date - Sep 30 , 2025 | 11:45 PM

సహకార సంఘం అభివృద్ధికి సభ్యులు మరింత కృషి చేయాలని నాప్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు పేర్కొన్నారు.

సంఘం అభివృద్ధికి మరింత కృషి

గంభీరావుపేట, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : సహకార సంఘం అభివృద్ధికి సభ్యులు మరింత కృషి చేయాలని నాప్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు పేర్కొన్నారు. త్వరలో 16 లక్షల వాటాధనాన్ని సభ్యులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్ట నున్నట్టు తెలిపారు. మండల కేంద్రంలోని సింగిల్‌విండో కార్యా లయంలో మంగళవారం మహాజన సభను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రవీందర్‌రావు మాట్లాడుతూ సహకార సంఘంలో 3910 సభ్యులు ఉండగా, సగం మందికి పైగా సభ్యులు లావాదేవీలు జరపడం లేదన్నారు. ఎప్పటికప్పుడు లావాదేవీలు జరపాలన్నారు. ఖాత తెరిచి పదేళ్ళ వరకు ఎలాంటి లావాదేవీలు జరపని పక్షంలో ఖాతాలోని డబ్బులు రిజర్వ్‌ బ్యాంక్‌కు వెళ్లిపోయే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కొందరు లావాదేవీలు జరపక పోవడంతో రూ.4కోట్ల వరకు రిజర్వ్‌ బ్యాంక్‌కు వెళ్లిపోయాయ న్నారు. క్రియా శీలకంగా ఉన్న సభ్యులకు ఏదైనా విపత్తు జరిగితే కుటుంబ సభ్యులకు ప్రయోజనం జరుగుతుందన్నారు. సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలుకు మహజన సభ తీర్మాణం చేసింది. ఈ సమావేశంలో మానిటరింగ్‌ అధికారి గౌస్‌, ఉపాధ్యక్షులు రామాంజనేయులు, సెస్‌ డైరెక్టర్‌ నారాయణరావు, సీఈవో రాజిరెడ్డి, రైతులు, డైరెక్టర్లు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Sep 30 , 2025 | 11:45 PM