Share News

అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు మోదీ

ABN , Publish Date - Sep 17 , 2025 | 11:42 PM

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ప్రధాని మోదీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు.

అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు మోదీ
రక్తదాన శిబిరం నిర్వహిస్తున్న బీజేపీనాయకులు

భగత్‌నగర్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ప్రధాని మోదీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని వైశ్య భవన్‌లో ప్రధాని మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సేవా పక్వాడలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయంగా అత్యధికంగా 18 దేశాలు మోదీకి ఆయా దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు అందించి సత్కరించాయన్నారు. ఈ సందర్భంగా 75 యూనిట్ల రక్తాన్ని సేకరించి ప్రభత్వు ఆసుపత్రికి అందించారు. కార్యక్రమంలో గుగ్గిళ్లపు రమేష్‌, ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి, బోయినపల్లి ప్రవీణ్‌రావు, మాడ వెంకట్‌రెడ్డి, దురుశెట్టి సంపత్‌, దుబాల శ్రీనివాస్‌, ఎన్నం ప్రకాశ్‌, బల్బీర్‌సింగ్‌, గుజ్జ శ్రీనివాస్‌, గాజుల స్వప్న, జాడి బాల్‌రెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 11:42 PM