శ్యామా ప్రసాద్ ఆశయాలను నెరవేర్చిన మోదీ
ABN , Publish Date - Jul 07 , 2025 | 12:26 AM
శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆలోచనలను, ఆశయాలను, ఆకాంక్షలను మోదీ నెరవేర్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు.
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
భగత్‌నగర్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆలోచనలను, ఆశయాలను, ఆకాంక్షలను మోదీ నెరవేర్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని నగరంలోని ఎంపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆకాంక్షలకు అనుగుణంగా వాజ్‌పేయి ప్రభుత్వం అణ్వాయుధాలను సమకూరిస్తే, 370 ఆర్టికల్‌ను రద్దు చేసి శ్యామా ప్రసాద్ ముఖర్జీ కలను నరేంద్రమోదీ నెరవేర్చారన్నారు. మధ్య దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వ ఫలాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్న ప్రభుత్వం నరేంద్రమోదీదే అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్‌రావు, బీజేపీ ఉపాధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, కొలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.