అసత్య ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలి
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:58 AM
అసత్య ప్రచారాం చేస్తున్న ఎమ్మె ల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ లంబాడీ గిరిజన సంఘాల ఐక్య వేధిక ఆధ్వ ర్యంలో శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ చౌ రస్తాలో గిరిజనులు ధర్నా పట్టారు.
సిరిసిల్ల టౌన్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : అసత్య ప్రచారాం చేస్తున్న ఎమ్మె ల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ లంబాడీ గిరిజన సంఘాల ఐక్య వేధిక ఆధ్వ ర్యంలో శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ చౌ రస్తాలో గిరిజనులు ధర్నా పట్టారు. ఈ సంద ర్భంగా ఐక్య వేదిక నాయకులు మాట్లాడారు. బంజారా లంబాడీలు సింధు నాగరికత కాలం నుంచే ఈ దేశంలో నివాసులు అన్నారు. భారత దేశ స్వాతంత్ర్యానికి ముందే గిరిజనులుగా గు ర్తింపు పొందారన్నారు. జూలై 24న ఎమ్మెల్యేలు సోయం బాబురావు, తెల్లం వెంకట్రావు లంబా డీలను గిరిజన జాబితా నుంచి తొలగించాలని కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారని ఆరోపిం చారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీ సీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ సమాధా నం చెప్పాలని, రిట్ పిటిషన్‌పై బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీల వైఖరిని వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్య వేదిక నాయకులు సురేష్‌నాయక్, నరేష్ నాయక్, భూక్య జగన్‌లాల్, రెడ్డినాయక్, శర్మన్ నాయక్, రవిలాల్‌నాయక్, బిక్కునాయక్, బిల్లునాయక్, రాజునాయక్, గోపినాయక్, తిరుపతినాయక్, దేశినాయక్, ప్రభునాయక్, ప్రకాష్‌నాయక్, హనుమంతునాయక్, భూపతి నాయక్, సంతోష్‌నా యక్, లాకావత్‌నాయక్, కేపతినాయక్, బిక్కునా యక్, మోతిలాల్ నాయక్, భాస్కర్‌నాయక్ పాల్గొన్నారు.