Share News

ప్రజలను విస్మరించిన ఎమ్మెల్యే కేటీఆర్‌

ABN , Publish Date - Aug 10 , 2025 | 01:18 AM

సిరిసిల్ల నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయ డంతోపాటు ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటారని ప్రజలు ఓట్లు వేసి సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్‌ను మరోసారి గెలిపిస్తే 20నెలలు గడుస్తున్నా ఇంతవరకు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలను విస్మరించిన ఎమ్మెల్యే కేటీఆర్‌

సిరిసిల్ల రూరల్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయ డంతోపాటు ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటారని ప్రజలు ఓట్లు వేసి సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్‌ను మరోసారి గెలిపిస్తే 20నెలలు గడుస్తున్నా ఇంతవరకు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోపి మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు సిరిసిల్ల నియోజకవర్గంలో చేపట్టిన ప్రతి అభివృద్ధి పనులను ఆయన సామాజిక వర్గానికి అందించారని ఆరోపించారు. 20 నెలల క్రితం జరిగిన ఎన్నికలల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇప్పటివరకు ఎన్ని రోజులు ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి సిరిసిల్లలో ఉన్నా రనే విరాలను బహిరంగంగా ప్రకటించాలన్నారు. గత ప్రభుత్వం ప్రజల సమస్యలను స్థానిక ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండి పరి ష్కరించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే కాంపు కార్యాలయాన్ని సిరిసిల్లలో కోట్లు రూపాయలు ఖర్చుచేసి నిర్మించిందని, అందులో కేటీఅర్‌ ఎప్పుడు నిద్ర చేసి ప్రజల సమస్యలను పరిష్కరించారో తెలిపాలని డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజక వర్గ కేంద్రంలో ప్రతి శని, ఆదివారాలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఫోన్‌ ట్యాపింగ్‌లో సిట్‌ ముందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ హాజరైతే దానిపై కేంద్ర హోం శాఖ మంత్రికి ఇంటలిజెన్స్‌ పనితనం తెలి యదని కేటీఆర్‌ మాట్లాడడం సరైంది కాదన్నారు. వాస్తవంగా కేటీఆర్‌ చేతిలో ఇంటలిజెన్స్‌ను పెట్టుకుని సినిమా హీరోయిన్‌లు, హీరోలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్‌లను ట్యాపింగ్‌ చేయించి వారి నుంచి లక్షలతో పాటు కోట్ల రూపాయలను తీసుకు న్నాడని అరోపించారు. ఇంటలిజెన్స్‌ చేతిలో పెట్టుకుని వాళ్లు చేసిన మోసాలను ప్రభాకర్‌రావు సిట్‌ విచారణలో చెబుతున్నాడనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిపై నోరుజారీ సహించేది లేదన్నారు. ఇప్పటికైనా సిరిసిల్లలో వారానికి ఒక రోజు ప్రజలకు అందుబాటులో ప్రజ సమస్యలను పరిష్కరించాలని లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ కరీంనగర్‌ పార్లమెంటరీ కో-కన్వీనర్‌ అడెపు రవీందర్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు మ్యాన రాంప్రసాద్‌, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌, జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు, పోన్నాల తిరుపతిరెడ్డి, అసాని లింగారెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Aug 10 , 2025 | 01:18 AM