Share News

రైతులపై కక్షగట్టిన ఎమ్మెల్యే ‘కవ్వంపల్లి’

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:37 AM

రైతులపై కక్ష్యగట్టిన ఎమ్మెల్యే సత్యనారాయణ తన వైఖరిని మా ర్చుకోవాలని మానకొండూర్‌ మాజీ ఎమ్మెల్యే రసమ యి బాలకిషన్‌ పేర్కొన్నారు.

రైతులపై కక్షగట్టిన ఎమ్మెల్యే ‘కవ్వంపల్లి’

ఇల్లంతకుంట, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): రైతులపై కక్ష్యగట్టిన ఎమ్మెల్యే సత్యనారాయణ తన వైఖరిని మా ర్చుకోవాలని మానకొండూర్‌ మాజీ ఎమ్మెల్యే రసమ యి బాలకిషన్‌ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రంగనాయకసాగర్‌ నుండి సాగునీరు కావాలని రైతులు నిరాహారదీక్ష చేస్తుంటే ఎమ్మె ల్యే వారిని కనీసం కలిసే సమయం లేదా అని ప్రశ్నించారు. ఇల్లంతకుంటలో బాడీఫ్రీజర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎందుకు సమస్య పట్టించుకోవడం లేదన్నా రు. గత ప్రభుత్వ హయాంలో కేవలం ఫారెస్టు క్లియరెన్స్‌ లేకనే కాలువ పనులు నిలిచిపోయాయన్నారు. రూ1.25కోట్లు కేటాయిస్తే కాలువ పనులు పూర్తి అవు తాయన్నారు. నిధుల మంజూరు ఎమ్మెల్యేతో కాకపోతే ఆర్థికశాఖ మంత్రిని తాను కలిసి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్న సహకార సంఘ అధ్యక్షులను ఎందుకు తొలగించారో ప్రజలకు వివరించాలన్నారు. జిల్లాలో అన్ని సంఘూల అధ్యక్షులకు గడువు పెంచి కేవలం ఇల్లంతకుంట మండల అధ్యక్షులను తొలగించి పర్స న్‌ ఇంచార్జీలను నియమించడంలో ఆంతర్యం ఏమిట ని ప్రశ్నించారు. రైతులు గత ప్రభుత్వంలో ఏనాడు రైతులు నిరసన తెలుపలేదన్నారు. రైతుబందు, రుణమాఫీ అందక రైతులు ఇబ్బందిపడుతున్నారని, మార్పు అంటే ఇదేనా అని అన్నారు. అన్నపూర్ణ రిజర్వాయర్‌ ద్వారా సాగునీటి అందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని లేనట్లయితే రైతులతో కలిసి బీఆర్‌ ఎస్‌ ఉద్యమాలు కొనసాగిస్తుందన్నారు. కమీషన్లపై ఉన్న ప్రేమ కాలువల నిర్మాణాలపై చూపెట్టాలన్నారు. సమావేశంలో మండలశాఖ అధ్యక్షుడు పల్లె నర్సింహ్మరెడ్డి, సెస్‌డైరెక్టర్‌ రవీందర్‌రెడ్డి, నాయకులు సాదుల్‌, దేవేందర్‌రెడ్డి, గొట్టెపర్తి పర్శరాం, కొట్టె వెంకన్న, అంత గిరి భాస్కర్‌, దయ్యాల మహేష్‌, మధు, దుర్గయ్య, బాలగౌడ్‌, రాములు, హరికుమార్‌, పర్శరాం, సతీష్‌, నరేష్‌కుమార్‌, గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌, బాగయ్య, నర్స య్య, రాజు, బలరాం, దేవయ్య పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 12:37 AM