Share News

సమస్యల పరిష్కారంపై మంత్రి సానుకూల స్పందన

ABN , Publish Date - Jun 02 , 2025 | 12:56 AM

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమ స్యల పరిష్కారంపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు సానుకూలంగా స్పందించారు.

సమస్యల పరిష్కారంపై మంత్రి సానుకూల స్పందన

సిరిసిల్ల టౌన్‌, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమ స్యల పరిష్కారంపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు సానుకూలంగా స్పందించారు. ఆదివారం హైదారాబాద్‌లో మంత్రి శ్రీధ ర్‌బాబును సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు చెందిన వివిధ సంఘాల నాయ కులు మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యలను మంత్రికి వివరించారు. పవర్‌లూం పరిశ్ర మపై కరెంటు సమస్య, బ్యాంక్‌ బిల్లింగ్‌ల వంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి శ్రీధర్‌బాబు సమస్యలపై సానుకూలంగా స్పందించారు. ఆర్థిక మంత్రితో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని హామీనివ్వడంపై వస్త్ర పరిశ్రమ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రిని కలసిన వారిలో సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సం ఘం అధ్యక్షుడు తాటిపాముల దామోదర్‌, ప్రధానకార్యదర్శి గౌడ రాజు, ఉపాధ్యక్షుడు ఏనుగుల ఎల్లయ్య, పాలిస్టర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్‌, ప్రధాన కార్యదర్శి అంకాలపు రవి, నాయకులు బూట్ల నవీన్‌, బూట్ల సతీష్‌, బండారి అశోక్‌ ఉన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 12:56 AM