Share News

స్టాళ్లను సందర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు

ABN , Publish Date - Aug 16 , 2025 | 12:11 AM

స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా పోలీస్‌పరేడ్‌ గ్రౌండ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్టాళ్లను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు మల్లేశంతోపాటు జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి, పోలీస్‌కమిషనర్‌ గౌస్‌ ఆలం, అదనపు కలెక్టర్‌లు సందర్శించారు.

స్టాళ్లను సందర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు

కరీంనగర్‌ అర్బన్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా పోలీస్‌పరేడ్‌ గ్రౌండ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్టాళ్లను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు మల్లేశంతోపాటు జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి, పోలీస్‌కమిషనర్‌ గౌస్‌ ఆలం, అదనపు కలెక్టర్‌లు సందర్శించారు. ఈ సందర్భంగా స్టాళ్లలో ఏర్పాటు చేసిన ఆయుధాలను, మిల్లెట్లను, వ్యవసాయ పనిముట్లు, డిజాస్టర్‌ పనిముట్ల, పిండివంటల స్టాళ్లను తిరిగి స్టాళ్ళలోని సిబ్బందిని అడగితెలుసుకున్నారు. ఒక సంస్థ కరీంనగర్‌ మున్సిపల్‌కు బహుకరించిన రెండు ఎలక్ట్రికల్‌ ఆటోలను మంత్రి శ్రీధర్‌బాబు మున్సిపల్‌ కార్పొరేషన్‌కు అందజేశారు.

Updated Date - Aug 16 , 2025 | 12:11 AM