దత్తాత్రేయ స్వామి ఆలయంలో మంత్రి పూజలు
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:54 AM
రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీ దత్తాత్రేయ స్వామివారిని వేడుకున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
బోయినపల్లి, డిసెంబర్, 5 (ఆంధ్రజ్యోతి) రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీ దత్తాత్రేయ స్వామివారిని వేడుకున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బోయినపల్లి మండలంలోని వరదవెల్లి గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి గుట్టపై జరుగుతున్న దత్త జయంతి ఉత్సవా ల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఽశుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పీడ్ బోట్‌లో మంత్రి పొన్నం, విప్ ఆది గుట్టపై చేరుకున్నారు. సంద ర్భంగా దత్తాత్రేయ స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిం చారు.మంత్రి పొన్నం ప్రభాకర్ విప్ ఆది శ్రీనివాస్‌లకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి చిత్రపటాలను, ప్రసాదాలను ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దత్త జయంతి ఉత్సవాల సమయంలోనే కాకుండా ప్రతి రోజు దర్శనం కోసం బోట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. అనంతరం విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాలకు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఏనుగుల కనకయ్య, బీసీ సెల్ అధ్యక్షుడు కుస రవీందర్, మండల పార్టీ అధ్యక్షులు వెన్నెల రమ ణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.