కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలి
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:42 AM
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారు చేసే కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయడంతోపాటు వారి సమస్యలను పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్ డిమాండ్ చేశారు.
సిరిసిల్ల కలెక్టరేట్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారు చేసే కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయడంతోపాటు వారి సమస్యలను పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వ ర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులతో రిలే నిరాహార దీక్షలను బుధవా రం చేపట్టారు. దీక్ష శిబిరాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు పాల్గొని దీక్షలో కూర్చోని మధ్యాహ్న భోజన కార్మికులకు దండలు వేసి దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు రూ 10వేల చొప్పున జీతాన్ని వెంటనే అమలుచేయాలన్నారు. గత సంవత్సర కాలం నుంచి కోడి గుడ్ల బిల్లులు రాక మధ్యాహ్న భోజన కార్మికులు ఇబ్బం దులు పడుతున్నారని, వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి వారిని ఆదుకోవాలన్నారు. అనంతరం ఏఐటీ యూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ అనేక పోరా టాలు చేయడంతోనే మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.2వేలు పెం చిందన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేత నం చెల్లించాలని, ఉద్యోగ భధ్రత కల్పించాలని, నిత్యావసర సరుకులు ప్రభుత్వమే సరఫరా చేయాలని, మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మన్, మధ్యాహ్నభోజన కార్మికులుజుబేదా, లక్ష్మీనర్సవ్వ, విజయ, జ్యోతి, మమత, రోజా, లక్ష్మి, కొమురవ్వ, ఇమాం బేగం, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.