మిల్లర్లు ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తీసుకోవాలి
ABN , Publish Date - Oct 28 , 2025 | 11:18 PM
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కొనుగోలు కేంద్రా లను ట్యాగ్ చేసిన మిల్లర్లు ధాన్యాన్ని ఎప్పటిక ప్పుడు తీసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కొనుగోలు కేంద్రా లను ట్యాగ్ చేసిన మిల్లర్లు ధాన్యాన్ని ఎప్పటిక ప్పుడు తీసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం ఖరీఫ్ సీజన్ ధాన్యం, పత్తి, మొక్కజొన్న తదితర పంటఉత్పత్తుల కొను గోలు ఇతర అంశాలపై జిల్లాలోని రా బాయిల్డ్ రైస్‌మిల్లర్లు, జిన్నింగ్ మిల్లర్లు, వివిధ శాఖల అధి కారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణగా కొనుగోలు కేంద్రాలను ట్యాగ్ చేసిన మిల్లర్లు రైస్‌మిల్లలకు ధాన్యం ఎప్పటికప్పుడు దిగుమతిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. కావాల్సిన హమాలీలను సిద్ధంగా ఉంచుకోవాలని ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. బ్యాంకు గ్యారెంటీ, అగ్రిమెంట్‌లు, రెండురోజుల్లో అందించాలన్నారు. 2024-25 ఖరీఫ్, యాసంగి సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్‌ను గడువులోగా అందించాలని రైస్ మిల్లర్లును ఆదేశించారు. మిల్లులోని గన్నీ సంచులను ఆయా కొనుగోలు కేంద్రాల కు వెంటనే తరలించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు అను గుణంగా రైస్‌మిల్లర్లు ముందుకు వెళ్లాలని వాటిని అతిక్రమిస్తే చట్టపర మైన చర్యలు తీసుకుంటామన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకరావాలని పేర్కొన్నారు. రైస్‌మిల్లర్ల ఇబ్బందులను పౌరసర ఫరాల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, పరిష్కరించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
జిన్నింగ్ మిల్లులో అన్ని వసతులు కల్పించాలి..
జిల్లాలోని ఐదు సీసీఐ కొనుగోలు కేంద్రాలైన జిన్నింగ్ మిల్లుల వద్ద పత్తి రైతులకు కనీస వసతులను కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. కేంద్రాల వద్ద మద్దతు ధర తదితర అంశాలు తెలిపేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలన్నారు. తూనికలు కొలతల శాఖ ఆమోదించిన కాం టాలను వినియోగించాలని, అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు పోందాలని అదేశించారు. జిల్లాలో మొక్కజోన్న కొనుగోలు కేంద్రాలు రెండు ఏర్పాటు చేశామని, ఆయా ప్రాంతాల రైతులు వీటిని సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, డీఆర్‌డీవో శేషాద్రి, డీసీఎస్‌వో చంద్ర ప్రకాష్, డీఏవో అప్జల్ బేగం, డీసీవో రామకృష్ణ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, మార్కెటింగ్ శాఖ అధికారి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.