క్రీడలతో మానసికోల్లాసం..
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:38 AM
క్రీడలతో మానసిక ఉల్లాసం,శారీరక దృఢత్వం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు.
వేములవాడ, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): క్రీడలతో మానసిక ఉల్లాసం,శారీరక దృఢత్వం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. రాజన్న సిరి సిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మొదటి రాష్ట్రస్థాయి ఓపెన్ కుంగ్‌ఫూ చాంపియన్‌షిప్ పోటీలను ఆదివారం జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటలు ఆడటం వల్ల శారీ రక దృఢత్వం లభిస్తుందని తెలిపారు. ఈ ప్రాంతంలో అనేక మంది క్రీడాకారులకు నిలయంగా మారింద న్నారు. విద్యార్థులు చదువుతో పాటుగా కరాటే కుంగ్‌పూ పోటీలలో సైతం విద్యార్థులు రాణించాలని కోరారు. తల్లిదండ్రులు విద్యార్థులపై, క్రీడాకారులపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పట్టుదలతో కృషి చేయాలని సూచించారు. పట్టుదల ఉంటే సాధించలే నిదీ ఏదీ లేదని, గెలుపుతో మురిసిపోకుండా, ఓటమితో కృంగిపోకుండా జీవితంలో రాణించడం నేర్చుకోవాలని సూచించారు. జీవితంలో వచ్చే ఆటుపోట్లను ఎదిరించే విధంగా శక్తి సామర్థ్యాన్ని పెంపొందించేలా క్రీడలు దోహదపడుతాయని కోరారు.మానసిక ఉల్లాసం, శారీరక దృడత్వం లభిస్తుందని తెలిపారు. ఎల్లప్పుడూ క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని హామీచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి క్రీడలకు పెద్దపీఠ వేస్తున్నారని అందులో భాగంగా రాష్ట్రంలో క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంద న్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనీ క్రీడాకారులను వెలికితీయడానికి సీఎం కప్ పేరుతో రాష్ట్ర ప్రభు త్వం ఆధ్వర్యంలో నిర్వహించను న్నట్లు పేర్కొన్నారు. ఈ సమావే శంలో నిర్వహకులు లెజండరీ గ్రాండ్ మాస్టర్ వీరాచారి, అసిస్టెంట్ గ్రాండ్ మాస్టర్ నేరెళ్ల శ్రీధర్ గౌడ్ తదిత రులు ఉన్నారు.