క్రీడలతో మానసికోల్లాసం, శారీరక దృఢత్వం
ABN , Publish Date - Aug 23 , 2025 | 01:00 AM
క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరక దృఢత్వం లభిస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ టౌన్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరక దృఢత్వం లభిస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అర్బన్ మండల స్థాయి ఆటల పోటీల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ క్రీడాపోటీల నిర్వహణ వల్ల మానసికోల్లాసంతో పాటు ఇతర ప్రాంతాల ప్రజల తో స్నేహభావం పెరుగుతుందన్నారు. యువత సన్మార్గంలో నడిచేందుకు, గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేసేందుకు సీఎం రూపొందించిన ప్రణాళిక లను పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన వ్యక్తులను కౌన్సెలింగ్ ద్వారా మార్చే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. 2036 ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. వేములవాడ ప్రాంతంలో మినీ స్టేడియం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, మర్రిపల్లి ప్రాంతంలో ఐదెకరాల స్థలంలో క్రీడామైదానం ఏర్పాటు చేయనున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో నాంపల్లి సింగిల్‌విండో చైర్మన్ బీరెడ్డి సల్మాన్‌రెడ్డి, చిలువేరి శ్రీనివాస్, బొజ్జ భారతి, రాగిరి నాగరాజు తదితరులు ఉన్నారు.