మానసిక పరిపక్వత పెంపొందించుకోవాలి
ABN , Publish Date - Apr 25 , 2025 | 01:26 AM
ప్రతిఒక్కరు మానసిక పరిపక్వత పెంపొం దించుకోవాలని ఎస్పీ మహేశ్ బీ గితే అన్నా రు.
సిరిసిల్ల క్రైం, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ప్రతిఒక్కరు మానసిక పరిపక్వత పెంపొం దించుకోవాలని ఎస్పీ మహేశ్ బీ గితే అన్నా రు. జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరె న్స్‌హాల్‌లో డీజీపీ జితెందర్ ఆదేశాల మేర కు గురువారం మానసిక ఆరోగ్య అవగాహ న సదస్సును ఏర్పాటుచేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్, ఆర్మ్‌డ్ పోలీస్ సిబ్బంది పాత్ర కీలకమన్నారు. సిబ్బంది సంక్షేమానికి తెలంగాణ పోలీస్‌శాఖ కట్టుబడి ఉందన్నా రు. అధికారులు, సిబ్బంది మానసిక స్థితి, ఆరోగ్యం కాపాడటం అనేది తక్షణ ఆవశ్యకతగా గుర్తించి సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. పోలీసు సిబ్బందికి శాఖ పరమైన, వ్యక్తిగత సమస్య ఉంటే ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకురావాలని సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా మన్నారు. అనంతరం వివిధ అంశాలపై మానసిక నిపు ణులు డాక్టర్ అశోక్ కుమార్ బృందం అవగాహన కల్పిం చారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆత్మహత్యల నివారణ సంస్థ చైర్మన్ డాక్టర్ అశోక్, సభ్యులు రామకృష్ణ, సైకాల జిస్ట్‌లు శైలజ, రామోజిరావు, బోడా అరుణ, సీఐలు మొ గిలి, మధుకర్, ఆర్‌ఐలు రమేశ్, మధుకర్, యాదగిరి, ఎస్‌ఐలు రమాకాంత్,రాంమ్మోహన్, ప్రశాంత్‌రెడ్డి, శ్రీకాం త్, ఆర్‌ఎస్‌ఐలు శ్రవణ్, సాయికిరణ్ పాల్గొన్నారు.