Share News

మానసికారోగ్యం మంచి సమాజానికి సోపానం

ABN , Publish Date - Oct 08 , 2025 | 11:55 PM

మానసిక ఆరోగ్య సంరక్షణ హక్కు మాత్రమే కాదని, బాధ్యతగా తీసుకున్నప్పుడే మంచి సమాజం నిర్మితమవుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధి క జైస్వాల్‌ అన్నారు.

మానసికారోగ్యం మంచి సమాజానికి సోపానం

ఎల్లారెడ్డిపేట, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) : మానసిక ఆరోగ్య సంరక్షణ హక్కు మాత్రమే కాదని, బాధ్యతగా తీసుకున్నప్పుడే మంచి సమాజం నిర్మితమవుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధి క జైస్వాల్‌ అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకు ని మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈసందర్భంగా రాధిక జైస్వాల్‌ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే మానసిక ధృడత్వం పెంచుకోవాలన్నారు. చెడు ఆలోచనలకు తావివ్వకుండా పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యం చేరుకోవాలని అన్నారు. ప్రస్తుత సమాజంలో చోటు చేసుకుంటున్న నేరాలు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. విద్యార్థులు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే తమ దృష్టికి తీసుకువస్తే ఉచిత న్యాయ సలహా ద్వారా పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఆలోచనలు, మానసిక ఒత్తిడిని అధిగమించడం తదితర అంశాల ను మానసికి వైద్య నిపుణుడు ప్రవీణ్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రాహుల్‌రెడ్డి, లోక్‌ అదాలత్‌ సభ్యుడు చింతోజు భాస్కర్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ పద్మావతి, అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2025 | 11:55 PM