Share News

మెగా లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Sep 11 , 2025 | 12:50 AM

జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా లీగల్‌ సర్వీ సెస్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పి. నీరజ అన్నారు.

మెగా లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

సిరిసిల్ల క్రైం, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా లీగల్‌ సర్వీ సెస్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పి. నీరజ అన్నారు. బుధవారం జిల్లా కోర్టులో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజలకు న్యాయసేవలను చేరువయ్యేలా కృషిచేయాలన్నారు. జిల్లా లీగల్‌ సర్విసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉచిత న్యాయం అందుతుందన్నారు. ఈనెల 13న జరిగే లోక్‌ అదాలత్‌లో రాజీ మార్గం ఉన్న క్రిమినల్‌, అన్ని సివిల్‌ కేసులకు లోక్‌అదాలత్‌లో పరిష్కారం లభిస్తుందన్నారు. భూతగాదాలు, బ్యాంకు రుణాలు, కుటుంబ కలహాలు, డ్రంకె న్‌డ్రైవ్‌, ట్రాఫిక్‌ ఉల్లంఘన, చెక్‌బౌన్స్‌, యాక్సిడెంట్‌ తదితర కేసుల్లో లోక్‌ అదా లత్‌ ద్వారా సేవలు వినియోగించుకోవాలన్నారు. సిరిసిల్ల, వేములవాడ కోర్టుల లో 10బెంచ్‌లను ఏర్పాటుచేసి శనివారం ఉదయం 10.30గంటల నుంచి సా యంత్రం 5వరకు లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తామన్నారు. ఇరువర్గాల్లోని కక్షిదారు ల్లో ఎవరికైన ఆర్థిక స్థోమత లేకపోయిన న్యాయసేవా సంస్థను సంప్రదిస్తే సేవలు అందిస్తుందన్నారు. ఒకసారి లోక్‌ అదాలత్‌లో కేసు పరిష్కారం అయి తే ఏ కోర్టుకు వెళ్లే అవకాశం లేదన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధికా జైస్వాల్‌, లోక్‌ అదాలత్‌ సభ్యులు చింతోజు భాస్కర్‌లు పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2025 | 12:50 AM