Share News

19లోపు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు పూర్తి..

ABN , Publish Date - Mar 14 , 2025 | 01:11 AM

ఓటర్‌ జాబితా సవర ణ, ఇతర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావే శాలు మార్చి 19లోపు పూరిచేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు.

19లోపు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు పూర్తి..

సిరిసిల్ల కలెక్టరేట్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఓటర్‌ జాబితా సవర ణ, ఇతర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావే శాలు మార్చి 19లోపు పూరిచేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాల నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫ రెన్స్‌ ద్వారి సమీక్షించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝ వీడియో సమావేశంలో పాల్గొన్నారు. సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ జిల్లాలో ప్రతి 3నెలలకు ఒకసారి పకడ్బందీగా అప్‌ డేట్‌ కావాలని, నూతనంగా 18సంవత్సరాలు పూర్తిచేసుకున్న ప్రతి ఒక పౌరుడికి ఓటు హక్కు కల్పించాలన్నారు. ఓటర్‌ జాబితా సవరణ, పోటీ చేసిన అభ్యర్థుల వివరాల సమర్పణ, బూత్‌ స్థాయి ఏజెంట్ల నియామకం తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మార్చి19లోపు సమావేశాల నిర్వహణ పూర్తిచేయాలని ఆదేశించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావే శాలు నిర్వహించే సమయంలో మీటింగ్‌ మినిట్స్‌ పకడ్బందీగా నమో దు చేసుకోవాలని, సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంతకాలను ప్రత్యేకమైన రిజిస్టర్‌లో తీసుకోవాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధు ల సమావేశం మినిట్స్‌ ఇతర వివరాలను మార్చి 27లోపు ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలని ఆదేశించారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో, రెవెన్యూ డివిజన్‌ అధికారులు, తహసీల్దార్ల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతి నిధుల సమావేశంలో నిర్వహించాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో వివిధ అంశాలకు వాడే ఫారం 6, 7, 8 వివరాలను పూర్తి స్థాయిలో వివరించాలని అన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల రెవెన్యూ డివిజన్‌ అధికారి రాధా బాయి, సంబంధిత అధికా రులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2025 | 01:11 AM