Share News

వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:15 AM

సిబ్బంది అందరూ తప్పనిసరిగా సమయపాలన పాటించాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదే శించారు.

వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి

చందుర్తి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): సిబ్బంది అందరూ తప్పనిసరిగా సమయపాలన పాటించాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదే శించారు. చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఇన్‌ చార్జి కలెక్టర్‌ శుక్రవారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఓపీ రిజిస్టర్‌, ల్యాబ్‌, ఫార్మసీ, ఇమ్యూనైజేషన్‌ గది, ఇన్‌ పేషెంట్‌ గదులు,ఇతర గదులు, ఆవరణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లా డుతూ సీజనల్‌ వ్యాధులపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి అవ గాహన కల్పించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబా టులో ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. సీజ నల్‌ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని తెలిపారు. ప్రసవాల సంఖ్యపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రులో ప్రసవాల సంఖ్య పెంచేందు కు కృషి చేయాలని ఆదేశించారు.

Updated Date - Nov 22 , 2025 | 12:15 AM