రోగులకు చిత్తశుద్ధితో వైద్య సేవలందించాలి
ABN , Publish Date - Oct 28 , 2025 | 11:19 PM
ప్రభుత్వ వెద్యశాలకు వచ్చే రోగు లకు వైద్యులు చిత్తశుద్ధితో సేవలు అందించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ ర్వాల్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ వెద్యశాలకు వచ్చే రోగు లకు వైద్యులు చిత్తశుద్ధితో సేవలు అందించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ ర్వాల్ అన్నారు. మంగళవారం జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలను ఇన్‌చార్జి కలె క్టర్ గరిమా అగర్వాల్ అధికారులతో కలిసి సందర్శించారు. మెటర్నిటీ, అప్తమాల జీ, ఎమర్జెన్సీ వార్డులు, రక్తపరీక్షల ల్యాబ్, ఆర్థోకి సంబంధించిన సదరం శిబిరాన్ని పరిశీలించారు. రిజిస్ట్రేషన్లు, వైద్య పరీక్షలు, వివరాల నమోదు పరిశీలించి శిబిరా నికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడారు. వైద్యులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, రోగు లకు చిత్తశుద్ధితో సేవలను అందించాలన్నారు. సదరం శిబిరానికి వచ్చే దివ్యాంగు లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రవీన్, డీఆర్డీవో శేషాద్రి, మున్సిపల్ కమిషన ర్ ఖదీర్‌పాషా, వైద్యుడు సంతోష్‌కుమార్, డీపీఎం రవీందర్ ఉన్నారు.