Share News

ప్రతి మహిళకు వైద్య పరీక్షలు

ABN , Publish Date - Sep 26 , 2025 | 12:25 AM

స్వస్థ్‌ నారి, సాశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కింద జిల్లా లోని ప్రతి మహిళకు వైద్య పరీక్షలు చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశించారు.

ప్రతి మహిళకు వైద్య పరీక్షలు

చందుర్తి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : స్వస్థ్‌ నారి, సాశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కింద జిల్లా లోని ప్రతి మహిళకు వైద్య పరీక్షలు చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశించారు. ఈనెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు కొనసాగనున్న స్వస్థ్‌నారి, సాశక్త్‌ పరివా ర్‌ అభియాన్‌లో భాగంగా చందుర్తి మండలం మూడపల్లి పల్లె దవాఖానలో గురువారం మహిళలకు వైద్య శిబిరం నిర్వహించగా, కలె క్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహిళలకు వివిధ పరీక్షలు వైద్యులు, సిబ్బంది చేస్తుండగా ఆరా తీశారు. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా మాట్లాడుతూ ప్రతి రోజూ ప్రత్యేక వైద్య నిపు ణులు ఆసుపత్రుల్లో అన్ని ఆరోగ్య పరీక్షలు చేస్తారని తెలిపారు. మహిళల్లో ఎక్కువగా కనిపించే రక్తహీనత డయాబెటిస్‌, రక్తపోటు సమస్యలపై ప్రత్యేక పరీక్షలు సలహాలు అందించాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళా శక్తివంతమైన కుటుంబము అనే కార్యక్రమం కింద ప్రత్యేక వైద్య నిపుణులతో కంటి పరీక్షలు, చెవి ముక్కు గొంతు, రక్తపోటు, డయాబెటిస్‌, దంత పరీ క్షలు, నోటి క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్స ర్‌ పరీక్షలు, గర్భిణులకు పరీక్షలు, టీబీ పరీక్షలు చేస్తారని, సికిల్‌ సెల్‌ ఎనీమియా, మాతా శిశు సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి కొరకు వంట నూనెలను తగ్గించడం ద్వారా ఊబకాయాన్ని తగ్గించ డం, రుతుక్రమ పరిశుభ్రత, పోషకాహారం గురించి మహిళలకు అవ గాహన కల్పిస్తారని వివరించారు. రక్తహీనత ఉన్న గర్భిణులు, బాలింతలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వారికి కావలసిన మందులు, పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించాలని ఆదేశిం చారు. మహిళలు శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపుని చ్చారు. శిబిరంలో వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2025 | 12:25 AM