కేసులు తగ్గించడానికి మధ్యవర్తిత్వం అవసరం..
ABN , Publish Date - Sep 28 , 2025 | 01:07 AM
లక్షల సంఖ్యలో పేరు కుపోయిన కేసులు తగ్గించడానికి మధ్యవర్తిత్వం ఎంతో అవసరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ అన్నారు.
సిరిసిల్ల క్రైం, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): లక్షల సంఖ్యలో పేరు కుపోయిన కేసులు తగ్గించడానికి మధ్యవర్తిత్వం ఎంతో అవసరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టు చాంబర్‌లో ఇటీవల సుప్రింకోర్టు ఆఫ్ ఇండియా, తెలంగాణ మీడియేషన్ అండ్ ఆర్పిట్రేషన్ సెంటర్ ఆధ్వర్యంలో 40 గంటల పాటు మధ్యవర్తిత్వ శిక్షణ పొందిన న్యాయవాదులు న్యాయ సేవాధికార సంస్థ జిల్లా చైర్‌పర్సన్ అండ్ జిల్లా జడ్జి నీరజ, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రాధికా జైస్వాల్‌లను మర్యాదపూ ర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానంగా కుటుంబ తగాదాలు, చెక్‌బౌన్స్‌లు, ఆస్తి పంపకాలు, తదితర వాటిలో మీడియేషన్ ద్వారా ఇరుపార్టీలు లబ్ధి పొందవచ్చన్నారు. ఇందుకు మధ్యవర్తిత్వ శిక్షణ పొందిన న్యాయవా దులు కృషిచేయాలన్నారు.