రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు..
ABN , Publish Date - Aug 01 , 2025 | 12:55 AM
సిరిసిల్ల-కరీంనగర్ ప్రధాన రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
బోయినపల్లి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల-కరీంనగర్ ప్రధాన రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే ఆదేశాల వేములవాడ మండలం నాంపెల్లి కూడలి, రుద్రవరం, ఆరెపెల్లి, బోయినపల్లి మండలంలోని కొదురుపాక రింగ్ రోడ్డు కూడలి వెంకట్రావుపల్లి వరకు ఉన్న రహదారిని జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే స్పాట్లను పరిశీలించి రోడ్డుపైన రంబుల్ స్ట్రిప్, స్టడ్‌లైట్స్, సోలార్ లైట్లు హజార్డ్ మార్కర్స్ వేగ నియంత్రణకు అమర్చుటకు స్థలాలను ఎంపిక చేశారు. కార్యక్ర మంలో ఎంవీఐ వంశీధర్, జిల్లా రవాణా శాఖ సభ్యులు సంగీతం శ్రీనాథ్, ట్రాఫి క్ సబ్ ఇన్‌స్పెక్టర్ రాజు, సిరిసిల్ల ఆర్‌అండ్‌బీ అధికారులు శాంతయ్య, వరప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.