Share News

మెనూ ప్రకారం భోజనం అందించాలి

ABN , Publish Date - Oct 31 , 2025 | 12:43 AM

జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్‌ విద్యాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ ఆదేశించారు.

మెనూ ప్రకారం భోజనం అందించాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్‌ విద్యాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువా రం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ, ఈఎంఅర్‌ఎస్‌ గురుకులాల డీసీవోలు, జీసీడీవో, డీఈవోలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా అన్ని విద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయులు, సి బ్బంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సం దర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని విభాగాల విద్యాయాల్లో డైనింగ్‌ హాల్లో మెనూకు సంబంధించిన పూర్తి వివరాలతో ఫ్లెక్సీలను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఆహార పదార్థాలకు వినియోగించే అన్ని వివరాల రిజిస్టర్లు పక్కాగా నిర్వహించాలన్నారు. విద్యాలయాలకు కాంట్రాక్టర్‌ సరఫరా చేసే కోడిగుడ్లు, చికెన్‌, మటన్‌ ఇతర అహార పదార్థాల నాణ్య తను ఖచ్చితంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. సమావేశం లో డీఈవో వినోద్‌కుమార్‌, డిప్యూటీ డీఈవో లక్ష్మీరాజం, విద్యాలయాల ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ డీసీవోలు రవీందర్‌రెడ్డి, సౌజన్య, భారతి, జీసీడీవో పద్మజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2025 | 12:43 AM