‘దసరా’ విజయాలు చేకూర్చాలి
ABN , Publish Date - Oct 01 , 2025 | 11:38 PM
దసరా అందరికి విజయా లు చేకూర్చాలని ఎస్పీ మహేష్ బి. గీతే అన్నారు.
సిరిసిల్ల క్రైం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : దసరా అందరికి విజయా లు చేకూర్చాలని ఎస్పీ మహేష్ బి. గీతే అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ముందస్తుగా విజయదశమి సందర్భం గా ఎస్పీ దుర్గాదేవికి పూజలు చేసిన అనంతరం ఆయుధపూజ, వాహన పూజలు చేసి జంబిచెట్టుకు పూజలు చేశారు. విజయదశమి సుఖసంతోషాలు కలిగించాలంటూ జిల్లా ప్రజలకు దసరా శుభాకాం క్షలు తెలిపారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల డిఎస్పీ చంద్రశే ఖర్‌రెడ్డి, ఆర్‌ఐలు మధుకర్, యాదగిరి, సిఐలు కృష్ణ, నాగేశ్వర్‌రావు, శ్రీనివాస్, ఆర్‌ఎస్‌ఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.