బీఆర్‌ఎస్ సిల్వర్‌జూబ్లీ వేడుకలకు భారీ ఏర్పాట్లు
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:10 AM
బీఆర్‌ఎస్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వరంగల్ జిల్లా పరిధిలోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించతలపెట్టిన పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను పండుగ వాతావరణంలో జరుపుకునేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్పారు.

కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వరంగల్ జిల్లా పరిధిలోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించతలపెట్టిన పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను పండుగ వాతావరణంలో జరుపుకునేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్పారు. శుక్రవారం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌కు ఇష్టమైన జిల్లా కరీంనగర్ అని ఇక్కడ నుంచి ప్రారంభించిన ఏ కార్యక్రమమైనా విజయవంతమవుతుందని భావిస్తారని అన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి లక్షా 50వేలకు తగ్గకుండా సభకు తీసుకు వెళ్లేందుకు రవాణా సౌకర్యంతో పాటు అవసరమైన అన్ని చర్యలను తీసుకున్నా మన్నారు. 400 ఆర్టీసీ బస్సులను, అందుబాటులో ఉన్న 90 ప్రైవేట్ బస్సు సర్వీసులను, జిల్లాలోని అన్ని ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులను కూడా తీసెకెళ్లనున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం కరీంనగర్, సిరిసిల్ల ముఖ్యనాయకులతో చింతకుంటలోని బీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్‌రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ మాజీ చైర్‌పర్సన్లు తుల ఉమ, కనుమల్ల విజయ, కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్ర రాజు, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథా లయ సంస్థ మాజీ చైర్మన్లు ఏనుగు రవీందర్‌రెడ్డి, పొన్నం అనీల్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్‌రావు, అక్బర్ హుస్సేన్, బీఆర్‌ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు, మాజీ సుడా డైరెక్టర్లు పాల్గొన్నారు.