కల్యాణం.. కమనీయం
ABN , Publish Date - Oct 13 , 2025 | 12:10 AM
జిల్లా కేంద్రంలోని యజ్ఞవరాహస్వామిక్షేత్రం భక్తులతో పోటెత్తింది. ఆదివారం ఉదయం మోహినీ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు.
కరీంనగర్ కల్చరల్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని యజ్ఞవరాహస్వామిక్షేత్రం భక్తులతో పోటెత్తింది. ఆదివారం ఉదయం మోహినీ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. వసుధాలక్ష్మీయజ్ఞవరాహ, రమాసత్యనారాయణ స్వామివారల కల్యాణం భక్తులను పరవశింపజేసింది. శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి అమ్మవారి మాలలను రాత్రి సమర్పించారు. అనంతరం శ్రీవారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. శ్రీపురం కాలనీ వాసులు సారె సమర్పించారు. కార్యక్రమంలో సర్వవైదికసంస్థానం మేనేజింగ్ ట్రస్టీ శ్రీభాష్యం వరప్రసాద్, సభ్యులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం హనుమద్వాహనం, మహాభిషేకం, సాయంత్రం డోలోత్సవం, రాత్రి ముత్యాలపందిరి వాహనసేవ నిర్వహించనున్నారు.