Share News

రెపా ఆధ్వర్యంలో పలువురికి సన్మానం

ABN , Publish Date - Sep 08 , 2025 | 12:40 AM

రెడ్డి ఎంప్లాయిస్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌(రెపా) ఎల్లారెడ్డిపేట మం డల శాఖ ఆధ్వర్యంలోని సభ్యులు వివిధ రంగాల్లో రాణిస్తున్న పలువురిని స్థానిక ఓ ఫంక్షన్‌ హాలులో ఆదివారం ఘనంగా సన్మానించారు.

రెపా ఆధ్వర్యంలో పలువురికి సన్మానం

ఎల్లారెడ్డిపేట, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): రెడ్డి ఎంప్లాయిస్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌(రెపా) ఎల్లారెడ్డిపేట మం డల శాఖ ఆధ్వర్యంలోని సభ్యులు వివిధ రంగాల్లో రాణిస్తున్న పలువురిని స్థానిక ఓ ఫంక్షన్‌ హాలులో ఆదివారం ఘనంగా సన్మానించారు. రెడ్డిలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. రాజా బహదూర్‌ వెంకట్రామిరెడ్డిని ఆదర్శంగా తీసుకుని పలు కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రెడ్డి కులస్థులందరూ ఐక్యతతో ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘం కన్వీనర్‌ దేవిరెడ్డి, రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు, ప్యాక్స్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటరెడ్డి, బాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాంరెడ్డి, భాస్కర్‌రెడ్డి, బాపురెడ్డి, జగన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రామేశ్వర్‌రెడ్డి, వెంకటనర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, వెంకటనర్సింహారెడ్డి, గిరిధర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకట్రామిరెడ్డి, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2025 | 12:40 AM