Share News

అయోడైజ్డ్‌ ఉప్పుతో పలు ప్రయోజనాలు

ABN , Publish Date - Oct 22 , 2025 | 12:03 AM

అయోడైజ్డ్‌ ఉప్పుతో పలు ప్రయోజనాలున్నాయని, మెదడు అభివృద్దికి, శారీరక ఎదుగుదలకు ఉపయోగ పడుతుందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ తెలిపారు.

 అయోడైజ్డ్‌ ఉప్పుతో పలు ప్రయోజనాలు
ప్రతిజ్ఞ చేస్తున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ, ఇతర అధికారులు, సిబ్బంది

సుభాష్‌నగర్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): అయోడైజ్డ్‌ ఉప్పుతో పలు ప్రయోజనాలున్నాయని, మెదడు అభివృద్దికి, శారీరక ఎదుగుదలకు ఉపయోగ పడుతుందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ తెలిపారు. మంగళవారం ప్రపంచ అయోడిన్‌ లోపం రుగ్మతల నివారణ దినోత్సవం సందర్భంగా ఆయన అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అయోడిన్‌ ప్రయోజనాల గురించి తెలియజేశారు. అయోడిన్‌ రోగ నిరోధక శక్తిని పెంచుతుందని, గర్భిణులు, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. అయోడిన్‌ కలిగిన ఉప్పునే వాడాలని సూచించారు. అయోడిన్‌ లోపం వల్ల గొయిటర్‌ (మెడ ఉబ్బరం), బుద్ధి మాంద్యం, బలహీనత, అలసట కలుగుతుందని తెలిపారు. అనంతరం ఎన్‌సీడీ పీవో డాక్టర్‌ విప్లవశ్రీ మాట్లాడుతూ అయోడిన్‌ ఉప్పు వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డీటీసీవో డాక్టర్‌ రవిందర్‌రెడ్డి, డీఐవో డాక్టర్‌ సాజిద, ఎంసీహెచ్‌పీవో డాక్టర్‌ సన జవేరియా, డెమో రాజగోపాల్‌, డీపీవో స్వామి, సూపర్‌వైజర్‌ పోచయ్య పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2025 | 12:03 AM