Share News

30న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయండి

ABN , Publish Date - Oct 27 , 2025 | 11:55 PM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 30న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ కళాశాలలు, యూనివర్సిటీల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్‌ పిలుపునిచ్చారు.

30న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయండి

గణేశ్‌నగర్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 30న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ కళాశాలలు, యూనివర్సిటీల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్‌ పిలుపునిచ్చారు. మంకమ్మతోటలోని జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని పట్టించుకోవడం లేదని విమర్శించారు. కళాశాలల యాజమాన్యాలు ఎస్‌ఎఫ్‌ఐ నిర్వహించే బంద్‌కు మద్దతు తెలపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. బంద్‌ ద్వారా అయిన రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి నిధులు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కాంపెల్లి అరవింద్‌, జిల్లా ఉపాధ్యక్షులు వినయ్‌ సాగర్‌, ఆకాష్‌, జిల్లా కమిటీ సభ్యులు సందేశ్‌, రాకేష్‌, నాయకులు నరేష్‌, సన్ని, రఘు పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2025 | 11:59 PM