శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Nov 20 , 2025 | 01:00 AM
కబడ్డీ శిక్షణ శిబిరాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో రాణించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : కబడ్డీ శిక్షణ శిబిరాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో రాణించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం మినీ స్టేడి యంలో కబడ్డీ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్స్ కబడ్డీ బాలబాలి కలకు శిక్షణ శిబిరాన్ని, ప్రభుత్వం అందించిన కబడ్డీ మ్యాట్స్‌ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం, మంత్రుల సహకారంతో రాష్ట్రస్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీల ను నిర్వహించుకుందామన్నారు. గ్రామీణ క్రీడలైన కబడ్డీ, వాలీ బాల్ పోటీలకు జిల్లాలో ఆదరణ ఉందన్నారు. క్రీడాకా రులకు ప్రభుత్వం తరఫున తగిన సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామన్నారు. క్రీడా శాఖ మంత్రి శ్రీహరి, స్టోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గ్రామీణ క్రీడలతో పాటు ఆధునిక క్రీడాలపై ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం నుంచి క్రీడాకారులను తయారుచేయాలని, క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పోర్ట్ యూనివర్శిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారన్నారు. క్రికెట్ ప్రేమికులు, క్రీడాకారులు కోరిక మేర ప్రభుత్వ సహకారంతో ఇటీవల జిల్లా కేంద్రంలో క్రికెట్ క్రీడా మైదానం కేటాయించామన్నారు. అనంతరం కబడ్డీ అసోసియేషన్ నాయకులు ఆది శ్రీనివాస్‌ను సన్మా నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీరా రాందాస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఉపాధ్యక్షుడు బొప్ప దేవయ్య, టీపీసీసీ కో ఆర్డినేటర్ సంగీతం శ్రీని వాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్స య్య, మాజీ కౌన్సిలర్లు ఆడెపు చంద్రకళ, ఆడెపు ప్రభాకార్, కబడ్డీ అసో సియేషన్ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరుపతి, సిరి సిల్ల మండల అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ, వ్యాయామ ఉపా ధ్యాయులు, శిక్షకులు పాల్గొన్నారు.