మలి విడతలో ప్రధాన పార్టీల జోష్
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:39 AM
మలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలో జోష్ నింపింది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
మలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలో జోష్ నింపింది. రెండు మండలాల్లో కాంగ్రెస్ పార్టీకి, ఒక మండలంలో బీఆర్‌ఎస్ మద్దతుదారులు ఆధిక్యం సాధించారు. రాజ న్న సిరిసిల్ల జిల్లాలో రెండో విడతలో మూడు మండ లాల్లో జరిగిన ఎన్నికల్లో ఇల్లంతకుంట, బోయిన్‌పల్లి మండలాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కువ సంఖ్య లో గెలుపొందారు. తంగళ్ళపల్లి మండలంలో బీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. బీజేపీ, స్వతంత్రులు కూడా గట్టి పోటీనిచ్చారు. ఆదివారం ఎంతో ఉత్కంఠ గా సాగిన ఫలితాల వెల్లడిలో ప్రధాన పార్టీల జోష్ కనిపించింది. రెండో విడతలో 88 సర్పంచ్ స్థానాలు ఉండగా 11 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 77 స్థానాలకు పోటీ జరిగింది. ఫలితాల వెల్లడి తర్వా త 88 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 38 మంది గెలుపొందగా బీఆర్‌ఎస్ మద్దతుదారులు 32 మంది బీజేపీ మద్దతుదారులు 5 మంది స్వతంత్రులు 12 మంది గెలుపొందారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం ప్రాతినిధ్యం వహి స్తున్న నియోజకవర్గాల్లో ఉన్న ఇల్లంతకుంట, బోయిన నపల్లి మండలాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు అధిక స్థానాలను గెలుపొందారు. ఇల్లంతకుంటలో 35 సర్పం చ్ స్థానాల్లో కాంగ్రెస్ 19 మంది, బీఆర్‌ఎస్ 10 మంది, ిసీపీఎం ఒకరు,స్వతంత్రులు ఐదుగురు గెలుపొందారు. బోయిన్‌పల్లి మండలంలో 23 స్థానాలు ఉండగా కాం గ్రెస్ 12 మంది, బీఆర్‌ఎస్ 6 మంది, బీజేపీ ఒకరు, నలుగురు స్వతంత్రులు గెలుపొందారు.
కేటీఆర్ పట్టు పదిలం..
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ప్రాతినిధ్య వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం పరిధి లో ఉన్న తంగళ్ళపల్లి మండలంలో సర్పంచ్ స్థానాలు బీఆర్‌ఎస్ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకున్నారు. ఏకపక్షంగా కేటీఆర్ వైపు నిలిచారని భావిస్తున్నారు. తంగళ్ళపల్లి 30 సర్పంచ్ స్థానాలు ఉండగా బీఆర్‌ఎస్ 16 స్థానాల్లో మద్దతుదారులు గెలిచారు. కాంగ్రెస్ నామమాత్రంగా పోటీ ఇచ్చి 7 మందికే పరిమిత మైంది. బీజేపీ మద్దతుదారులు నలుగురు ఇతరుల ముగ్గురు గెలుపొందారు.