Share News

పరిసరాల పరిశుభ్రత పాటించాలి

ABN , Publish Date - May 31 , 2025 | 12:38 AM

గృహ పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధి కారి డాక్టర్‌ రజని అన్నారు.

పరిసరాల పరిశుభ్రత పాటించాలి

సిరిసిల్ల టౌన్‌, మే 30 (ఆంధ్రజ్యోతి) : గృహ పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధి కారి డాక్టర్‌ రజని అన్నారు. డెంగ్యూ, మలేరియా జ్వరాల నివారణలో భాగం గా శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని సిరిసిల్ల పట్టణం 36వార్డు, ప్రగతినగర్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. నీటి తొట్టిల్లో లార్వాను తొలగించాలని, నీటి నిల్వ ప్రాంతాలను పూడ్చివేయాలని, రోడ్లపై చెత్త తొల గించాలని, డ్రైనేజీలలో నీటి నిల్వ ఉండకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు ప్రయాణ సమయాల్లో మాస్కులు ధరించాలని, వర్షకాలంలో వచ్చే వ్యాధుల పై అవగాహన కల్పించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజని మాట్లా డుతూ వర్షకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణకు ప్రజ లు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి అనిత, మలేరియా సూపర్‌వైజర్‌ లింగం, వాణి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2025 | 12:38 AM