మహాత్మా జ్యోతిబా ఫూలేను స్ఫూర్తిగా తీసుకోవాలి
ABN , Publish Date - Nov 29 , 2025 | 12:40 AM
నేటి యువత మహా త్మా జ్యోతిబా ఫూలేను స్పూర్తిగా తీసుకోవాలని జిల్లా గ్రంథాలయం చైర్మన్ నాగుల సత్యనారాయణ అన్నారు.
సిరిసిల్ల టౌన్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : నేటి యువత మహా త్మా జ్యోతిబా ఫూలేను స్పూర్తిగా తీసుకోవాలని జిల్లా గ్రంథాలయం చైర్మన్ నాగుల సత్యనారాయణ అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే వ ర్దంతి సందర్భంగా శుక్రవారం జిల్లా గ్రంథాలయం ఆవరణలో ఆయన చిత్రపటానికి, అనంతరం జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలోని ఫూలే దంపతుల విగ్రహాలకు చైర్మన్ సత్యనారాయణతో పాటు బీసీ సంఘా ల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రంథాలయం సిబ్బంది, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, మున్నూరుకాపు సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం నర్స య్య, రజక సంఘం పట్టణ అధ్యక్షుడు దండు శ్రీనివాస్, నాయకులు కంసాల మల్లేశం, దేవరాజ్ పాల్గొన్నారు.