ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:50 AM
అర్హులందరూ ఎల్‌ఆర్ ఎస్ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు.

తంగళ్లపల్లి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): అర్హులందరూ ఎల్‌ఆర్ ఎస్ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. బుధవారం తంగళ్లపల్లి మండల పరిషత్ కార్యా లయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజాపాలన సేవ కేంద్రాన్ని పరిశీలించి, ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీ ఫైబర్ సర్వర్ రూంను పరిశీలించారు. అలాగే మండలంలో ఇంటి, ఇతర పన్ను ల వసూలుపై ఆరా తీశారు. భూముల క్రమబద్ధీకరణకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? వాటిలో ఎన్ని అప్రూవ్ అయ్యాయని అధి కారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 2893 దరఖాస్తులు అప్రూవ్ అయ్యాయని కలెక్టర్ దృష్టికి ఎంపీడీవో లక్ష్మీ నారాయణ తీసుకెళ్లారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు దారులకు పిలుపునిచ్చారు. ఇంటి, ఇతర పన్నులను సకాలంలో చెల్లించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఎంపీవో మీర్జా తదిత రులు పాల్గొన్నారు. అలాగే నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారు. ఓపీ, తదితర రిజిస్టర్లను పరిశీలించారు. మందులు ఇచ్చే గది, ల్యాబ్ తనిఖీ చేశారు. మందులు, వ్యాక్సిన్‌లపై ఆరా తీశారు. ప్రభుత్వ వైద్య సేవలు సద్వినియోగం చేసు కునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ దవాఖానలోనే ప్రసవాలు అయ్యేలా చూ డాలని, ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉండాలని ఆదేశించారు. వైద్యురాలు చంద్రికారెడ్డి, సిబ్బంది ఉన్నారు. అలాగే నేరెళ్లలోని బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశా రు. విద్యార్థులకు ఇస్తున్న రాగి జావను పరిశీలించారు. మెనూ ప్రకారం ఆహార పదార్థాలను సిద్ధం చేస్తున్నారా అని ఆరా తీశా రు. విద్యార్థులకు సిద్ధం చేసిన భోజనాన్ని పరిశీలించారు. పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు.