Share News

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు మరోసారి పొడిగింపు

ABN , Publish Date - May 08 , 2025 | 12:20 AM

లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్‌) గడు వును ప్రభుత్వం మరోసారి పొడిగించింది.

ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు మరోసారి పొడిగింపు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్‌) గడు వును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. నాలుగో సారి గడువు పొడిగిస్తూ ఈ నెలాఖరు వరకు ప్రభు త్వం మరో అవకాశాన్ని ఇచ్చింది. అనఽధికారిక లే అవు ట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేం దుకు ప్రభుత్వం ఇరవై ఐదు శాతం రాయితీ ప్రకటిం చినా ఆశించిన మేరకు దరఖాస్తుదారుల నుంచి స్పం దన రావడం లేదు. మొదట మార్చి నెలాఖరు వరకు గడువు విధించగా, దానిని ఏప్రిల్‌ 30 వరకు, ఆ తర్వాత ఈ నెల 3 వరకు పొడిగించినప్పటికీ, సాంకేతిక సమస్యల వల్ల కొన్ని ప్లాట్లు క్రమబద్ధీకరణ జరగలేదు. మున్సిపల్‌ అధికారుల ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు గడువు పొడి గించింది.

జిల్లాలో ఇప్పటి వరకు 6,393 మంది తమ ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుం చెల్లించారు. తద్వారా ప్రభుత్వానికి 25 కోట్ల 27 లక్షల ఆదాయం సమ కూరింది. మార్చి నెలాఖరు వరకు 4,892 మంది తమ ప్లాట్లకు క్రమబద్ధీకరించుకోగా, ప్రభుత్వానికి 17 కోట్ల 45 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. నెల రోజుల్లో 1501 మంది తమ ప్లాట్లను క్రమబద్ధీకరిం చుకోగా 7 కోట్ల 82 లక్షల ఆదాయం పెరిగింది. సాం కేతిక సమస్యల కారణంగా కొందరు ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లిం చలేక పోతున్నారు. మార్చి నెలాఖరు వరకు గడువు ఉన్నప్పుడు అధికార యంత్రాంగం విస్తృత ప్రచారం చేయడం వల్ల కొందరు ముందుకు వచ్చారు. ఏప్రిల్‌ నెలాఖరు వరకు ప్రభుత్వం గడువు పెంచిన తర్వాత సంబంధిత అధికారులు ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రచారం చేయలేక పోయారు.

జిల్లా వ్యాప్తంగా 25,514 దరఖాస్తులు..

జిల్లా వ్యాప్తంగా వచ్చిన 25,514 దరఖాస్తులు రాగా, ఇప్పటి వరకు 6.393 మంది తమ ప్లాట్లను క్రమబద్ధీ కరించుకున్నారు. తద్వారా 25 కోట్ల 27 లక్షల రూపా యల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యింది. జిల్లాలో వచ్చిన దరఖాస్తుల్లో పంచాయతీల్లో 5,777 దరఖాస్తులు రాగా, 4,925 దరఖాస్తులకు అధికారులు ఆమోదం తెలపగా, 1243 మంది 3 కోట్ల 66 లక్షల రూపాయల ఫీజు చెల్లించారు. రామగుండం మున్సి పల్‌ కార్పొరేషన్‌లో 7,092 దరఖాస్తులకు గాను, 4,516 దరఖాస్తులను ఆమోదించగా, 1,425 మంది 8 కోట్ల 11 లక్షల రూపాయల రుసుం చెల్లించారు. మంథని మున్సిపాలిటీలో 904 దరఖాస్తులకుగాను 834 దరఖా స్తులకు ఆమోదం తెలిపారు. 263 మంది 83 లక్షల రూపాయల రుసుం చెల్లించారు. పెద్దపల్లి మున్సిపాలి టీలో 10,366 దరఖాస్తులకు గాను 7,771 దరఖా స్తులకు ఆమోదం తెలిపారు. 3,128 మంది 11 కోట్ల 68 లక్షల రూపాయల రుసుం చెల్లించారు. సుల్తానా బాద్‌ మున్సిపాలిటీలో 1,544 దరఖాస్తులకు గాను, 1,248 దరఖాస్తులకు ఆమోదం తెలిపారు. 334 మంది 99లక్షల రూపాయలరుసుం చెల్లించారు.

విస్తృత ప్రచారం కల్పిస్తేనే

రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అడుగంటి పోవడంతో 25 శాతం రాయితీ కల్పిస్తూ ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని ప్రభు త్వం ముందుకు తీసుక వచ్చింది. దీనిపై మొదట మార్చి నెలాఖరు వరకు గడువు విఽధించగా, అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత మరో నెల రోజులు గడువు పెంచిన తర్వాత ప్రచారం మందగించింది. వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 33.15 శాతం దరఖాస్తుదారులు ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుం చెల్లించారు. 2020, ఆగస్టు 26లోపు సేల్‌ డీడ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసిన లే అవుట్‌ యజమానులు, ప్లాటు ఓనర్లకు ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించినట్లు ప్రకటించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని వేగిర పెట్టినా కూడా ఎవరు కూడా రుసుం చెల్లించేందుకు ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం 25 శాతం రాయితీ కల్పించి విస్తృత ప్రచారం చేపట్టింది. ప్రస్తుతం ఈ నెలాఖరు వరకు మరోసారి గడువు పెంచడంతో జిల్లా అదికార యం త్రాంగం ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ గడువు పెంపు గురించి ఎల్‌ఆర్‌ఎస్‌ చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురిం చి మరోసారి విస్తృత ప్రచారం కల్పిస్తేనే దరఖాస్తుదా రులు ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

Updated Date - May 08 , 2025 | 12:20 AM