కొనుగోలు కేంద్రాల్లో లారీలు అందుబాటులో ఉండాలి
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:16 AM
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలించేందుకు అవసరమైన లారీలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉం డాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు.
తంగళ్లపల్లి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలించేందుకు అవసరమైన లారీలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉం డాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. శుక్రవారం తంగళ్లపల్లి మండలంలోని తాడూర్, పాపలయ్యపల్లె, ఓబులాపూర్, సారంపల్లి, రాళ్లపే ట, కస్బెకట్కూర్, చీర్లవంచ గ్రామాల్లో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఆయా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు, వసతులు, పరిశీలించి పలు సూచనలు చేశారు. ధాన్యం తేమ శాతం, కొనుగోళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కనీస వసతులు కల్పించాలని కొనుగోలు కేంద్రాల నిర్వహకులను ఆదేశించారు. ధాన్యం తరలించేందుకు కేంద్రాలకు లారీలను ఎప్పటికప్పుడు అందుబాటులో పెట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశిం చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జయంత్ కుమార్, ఐకేపీ ఏపీఎం రజిత తదితరులు ఉన్నారు.