Share News

నిమజ్జనానికి తరలిన గణనాథుడు..

ABN , Publish Date - Sep 01 , 2025 | 01:00 AM

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌, రాచర్లగొల్లపల్లి గ్రామాల్లో శివకేశవస్వామి ఆలయ కమిటీ, యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి నిమజ్జన వేడుకలను ఆదివారం రాత్రి నిర్వహించారు.

నిమజ్జనానికి తరలిన గణనాథుడు..

ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి) : ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌, రాచర్లగొల్లపల్లి గ్రామాల్లో శివకేశవస్వామి ఆలయ కమిటీ, యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి నిమజ్జన వేడుకలను ఆదివారం రాత్రి నిర్వహించారు. ప్రత్యేక వాహనాల్లో ఆది దేవుడిని పురవీధుల గుండా ఊరేగించారు. భక్తజనం మంగళహారతులు సమర్పించారు. రాచర్లబొప్పాపూర్‌, రాచర్లగొల్లపల్లిలో సెస్‌ డైరెక్టర్‌ కృష్ణహరి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, తదితరులు నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. వీడ్కోలు వినాయక అంటూ సెలవు పలికారు. కార్యక్రమంలో నాయకులు రామచంద్రారెడ్డి, గణేశ్‌, నరేశ్‌, లక్ష్మారెడ్డి, సత్యంరెడ్డి, కిరణ్‌నాయక్‌, శ్రీకాంత్‌, రమేశ్‌, భీమేశ్వర్‌, సత్యం, శ్రీనివాస్‌రెడ్డి, రాజిరెడ్డి, కిషన్‌, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, మండల కేంద్రంలోని మార్కండేయస్వామి ఆలయంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి సిరిసిల్ల పట్టణంలోని జగద్గురు ఆదిశంకరచార్య భజన మండలి సభ్యులు భజన కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తి పాటలతో అలరించారు. కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు రాపల్లి దేవాంతం, ప్రధానకార్యదర్శి వనం రమేశ్‌, ఉపాధ్యక్షులు శ్రీరాం సుదర్శన్‌, గోస్కె దేవదాస్‌, సంయుక్త కార్యదర్శి రాపల్లి అంబదాస్‌, యూత్‌ అధ్యక్షుడు సుంకి భాస్కర్‌, ప్రధానకార్యదర్శి సుంకి విష్ణు, సోషల్‌ మీడియా ఇన్‌చార్జి దోమల భాస్కర్‌, దైవశెట్టి సుంకి వేణు, జిల్లా ఉపాధ్యక్షుడు పోతు ఆంజనేయులు, భజన మండలి బృందం సభ్యులు పత్తిపాక వాసుదేవ్‌, పల్ల బాలరాజు పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2025 | 01:00 AM