లోక్‌అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:45 AM
కేసులను సత్వరమే పరిష్కరించు కునేందుకు బాధితులు లోక్ అదాలత్‌లను వినియోగించుకోవాలని జిల్లా ప్రధానన్యా యమూర్తి పి.నీరజ కోరారు.
సిరిసిల్ల రూరల్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : కేసులను సత్వరమే పరిష్కరించు కునేందుకు బాధితులు లోక్ అదాలత్‌లను వినియోగించుకోవాలని జిల్లా ప్రధానన్యా యమూర్తి పి.నీరజ కోరారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో శనివారం జాతీ య లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిం చి 17వేల 724 కేసులను పరిష్కరించి రూ కోటి 79లక్షల 82వేల 998 నష్టపరిహారం బాధితులకు ఇప్పించారు. ఈ జాతీయ లోక్‌అదాలత్‌లో మోటార్‌వాహన ప్రమాద కేసులు 3, సివిల్ తగాదాలు 16, క్రిమినల్ కేసులు 398, ఎక్సైజ్ కేసులు 33, చెక్‌బౌన్స్ కేసులు 11, కుటుంబ తగాదాలు 1, గృహహింస కేసులు 6, భూసే కరణ కేసులు 2, బ్యాంకు కేసులు 9, డ్రంకెన్ డ్రైవ్ కేసులు 1725, ట్రాఫిక్ చలాన్ కేసులు 15వేల 508, ఈపీటీ కేసులు 12 పరిష్కరిం చామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ తెలిపారు. ఈ సంద ర్భంగా జరిగిన సమావేశంలో ఆమె నీరజ మాట్లాడుతూ కేసులను పెండింగ్‌లో పెట్టకుండా త్వరగా పరిష్కరించాలనే ధ్యేయంతో లోక్ అదాలత్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, అదనపు ఎస్పీ చంద్ర య్య, సీనియర్ సివిల్‌జడ్జి సిరిసి ల్ల-కమ్ ఎఫ్‌ఏసీ కార్యదర్శి డీఎల్ ఎస్‌ఏ లక్ష్మణాచారి, సిరిసిల్ల బార్ అసోషియేషన్ అధ్యక్షుడు జూపె ల్లి శ్రీనివాసరావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్, లోక్ అదా లత్ సభ్యులు చింతోజు భాస్కర్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్, న్యాయవాదులు, పోలీసులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.