కేసుల పరిష్కారానికి లోక్‌అదాలత్‌ను వినియోగించుకోవాలి
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:27 AM
కేసులను సత్వరమే పరిష్కరించుకునేందుకు బాధి తులు లోక్ అదాలత్‌లను వినియోగించుకోవాలని జిల్లా ఇన్‌చార్జీ ప్రధాన న్యాయమూర్తి బి. పుష్పలత కోరారు.
సిరిసిల్ల రూరల్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : కేసులను సత్వరమే పరిష్కరించుకునేందుకు బాధి తులు లోక్ అదాలత్‌లను వినియోగించుకోవాలని జిల్లా ఇన్‌చార్జీ ప్రధాన న్యాయమూర్తి బి. పుష్పలత కోరారు. సిరిసిల్ల జిల్లా కోర్టులో శనివారం ప్రత్యేక లోక్ అదాలత్‌ను ఏర్పాటు చేశారు. ఈ లోక్ అదా లత్‌లో 303 కేసులను పరిష్కారించి రూ 61 లక్షల 53వేల 958 నష్టపరిహారంగా ఇప్పించారు. ఈ లోక్ అదాలత్‌లో మోటార్ వాహన ప్రమాద కేసులు 1, సివిల్ తగాదాలు 14, భూసేకరణ కేసులు 2, క్రిమినల్ కేసులు 278, ఎక్సైజ్ కేసులు 4, చెక్‌బౌన్స్ కేసులు 3, కుటుంబ తగాదాలు 1 పరిష్కరించారు. ఈసందర్భంగా జిల్లా ఇన్‌చార్జీ ప్రధానన్యాయమూర్తి పుష్పలత మాట్లాడుతూ కేసులను పెండింగ్‌లో పెట్టకుండా త్వరి తగితన పరిష్కరించాలనే ధ్యేయంలో లోక్ అదాలత్‌లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో కేసులను పరిష్కరించుకో వాలని సూచించారు. ఈ లోక్ అదాలత్‌లో పోక్స్ కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి సిరిసిల్ల ఇన్‌చార్జ్ లక్ష్మణాచారి, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్, 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సృజన, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మేఘన, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ లోక్‌అదాలత్ సభ్యులు చింతోజు భాస్క ర్ తదితరులు పాల్గొన్నారు.