స్థానిక సంస్థల ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:00 AM
స్థాని క సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వ హించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణీకుముదిని ఆదేశించారు.
సిరిసిల్ల, నవంబరు 20 (ఆంరఽధజ్యోతి): స్థాని క సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వ హించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణీకుముదిని ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఎన్నికల సంఘం అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహే ష్ బి గీతే హాజరయ్యారు. గ్రామసర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా అభ్యంతరాలు, పోలింగ్ కేంద్రాలు, శాంతిభద్రత ల అంశాలపై సమీక్షించారు. ఈసందర్భంగా ఎన్నికల సంఘం కమిషనర్ మాట్లాడుతూ సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికలు ప్రశాంత వా తావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని, ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన కా ర్యాచరణ రూపొందించాలని తెలిపారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర,జిల్లా స్థాయిలో ఎన్నికల ప్ర వర్తన నియమావళి సమర్థవంతంగా అమ లుచేయాలని, ఎన్నికల పరిశీలకులకు శిక్షణ అందిస్తామని అన్నారు. జిల్లా స్థాయిలో ఏర్పా టు చేసే ఎన్నికల నిర్వ హణ కమిటీ సభ్యుల జాబితా సమర్పించా లని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్డీఓ శేషాద్రి, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీపీవో శరీఫోద్దిన్, డిప్యూటీ జడ్పీ సీఈవో గీత తదిత రులు పాల్గొన్నారు.