అర్హులందరికీ రుణాలు అందించాలి
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:25 AM
జిల్లాలోని అన్ని బ్యాంకులు, ప్రభుత్వ లక్ష్యం మేరకు అర్హులైన వారందరికి రుణాలు ఇవ్వాలని జిల్లాస్థాయి బ్యాంకర్స్ కమిటీ చైర్‌పర్సన్, ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని అన్ని బ్యాంకులు, ప్రభుత్వ లక్ష్యం మేరకు అర్హులైన వారందరికి రుణాలు ఇవ్వాలని జిల్లాస్థాయి బ్యాంకర్స్ కమిటీ చైర్‌పర్సన్, ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. కలెక్టరేట్ లో బుధవారం జిల్లాస్థాయి బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ముందుగా వ్యవసాయం, గృహ, విద్యరుణాలు, కేంద్ర, రాష్ట్రప్రభుత్వ పథకాల అమ లుపై బ్యాంకుల వారిగా ఇన్‌చార్జి కలెక్టర్ సమీక్షిం చారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లా డుతూ జిల్లాలోని బ్యాంకులు తమకు కేటాయిం చిన లక్ష్యాలు చేరుకోవాలని సూచించారు. వ్యవసా య, విద్య రుణాలు ప్రస్తుతం 50 శాతం పూర్తి చేయాలని, ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా వంద శాతం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా అమలుచేస్తున్న ఇందరిమ్మ ఇళ్ల లబ్ధిదారు లకు నిబంధనల ప్రకారం రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. బ్యాంక్‌లలో ఖాతాదారులకు తెలపా లని, కేవైసీ అప్‌డెట్ చేయించాలని సూచించారు. వచ్చేనెల 31వ తేదీలోగా ప్రక్రియ పూర్తి చేయాల ని తెలిపారు. బ్యాంక్‌లలో అందించే సేవలపై విని యోగదారులకు అవగాహన కల్పించాలని, ఆర్థిక అక్షరాస్యత, ఆర్థిక మోసాలపై వినియోగాదారుల కు అవగాహన కల్పించారు. 1930/1945 టోల్‌ఫ్రీ నంబర్‌పై వివరించాలని, పీఎంఈజీపీ, పీఎం ఎఫ్ ఎంఈ, స్వానిధి అమలు పురోగతిలను అడిగి తెలుకున్నారు. నాబార్డ్ అందించే వివిధ రుణాలపై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, డీఅర్‌డీవో శేషాద్రి, ఎల్‌డీఎం మల్లిఖార్జున్‌రావు, అర్భీఐ ఏజీఎం రాములుసహావత్, నాబార్డు డీడీ ఎం దిలీప్, యూబీఐ డీజీఎం అపర్ణరెడ్డి, ఎస్‌బీఐ ఏజీఎం వెంకటేష్, బ్యాంకుల ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.