Share News

నెరవేరిన రుణ లక్ష్యం

ABN , Publish Date - May 14 , 2025 | 12:37 AM

జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకు రుణ లక్ష్యం నెరవేరింది.

నెరవేరిన రుణ లక్ష్యం

జగిత్యాల, మే 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకు రుణ లక్ష్యం నెరవేరింది. గ్రామీణ ప్రాంతాల్లో పది మండలాలు మినహా లక్ష్యం మేరకు రుణాలు అందించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు బ్యాంక్‌ లింకేజీ కింద రుణాలు అందిస్తారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల నిర్వహణ చూస్తుంటారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల రుణ లక్ష్యం 12,630 సంఘాలకు రూ.765.67 కోట్లుగా ఉంది. ఇందుకు గాను 7,596 సంఘాలకు రూ. 765.66 కోట్ల రుణం అందించారు.

ఫబ్యాంకుల ద్వారా రుణాలు..

పది నుంచి పదిహేను మంది మహిళలు కలిసి స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడగా వారంతా ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు బ్యాంకుల ద్వారా గ్రూపు రుణాలు అందిస్తారు. ఇందుకోసం ప్రతి ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలను నిర్దేశిస్తారు. బ్యాంకు ద్వారా రుణాలు పొందే గ్రూపు మహిళలు వారు నిర్వహించేందుకునే వ్యాపారాలు సూచిస్తూ బ్యాంకు లింకేజీ కింద దరఖాస్తు చేసుకుంటారు. బ్యాంకులు ఆయా స్వయం సహాయక సంఘాల సీనియారిటీ అంతకు ముందు తీసుకున్న అప్పుకు సంబంధించి వారి చెల్లింపులను పరిగణనలోకి తీసుకుంటారు. సీనియారిటీ వారీగా రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు రుణాలు అందిస్తారు. బ్యాంకర్లు ఇచ్చిన అప్పుకు 12 నుంచి 14 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది.

ఫఅత్యధికంగా ఇబ్రహీంపట్నంలో పంపిణీ

జిల్లా వ్యాప్తంగా మండలాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా ఇబ్రహీంపట్నంలో 132.60 శాతం, కొడిమ్యాల 125.65 శాతం, పెగడపల్లిలో 113.06 శాతం, అత్యల్పంగా గొల్లపల్లిలో 81.96 శాతం, బీర్‌పూర్‌లో 88.33 శాతం రుణాలను పంపిణీ చేశారు. కథలాపూర్‌లో 108.32 శాతం, కోరుట్లలో 101.96 శాతం, మల్యాలలో 101.63 శాతం, మల్లాపూర్‌లో 100.60 శాతం, మేడిపల్లిలో 100.04 శాతం, మెట్‌పల్లిలో 99.32 శాతం, జగిత్యాలలో 97.90 శాతం, ధర్మపురిలో 94.39 శాతం, బుగ్గారంలో 93.12 శాతం, రాయికల్‌లో 92.80 శాతం, జగిత్యాల రూరల్‌లో 93.55 శాతం, వెల్గటూరులో 90.87 శాతం, సారంగపూర్‌లో 99.99 శాతం బ్యాంకు లింకేజీ రుణాలను అందించారు. గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలు చిన్న, పెద్ద వ్యాపారాలు నిర్వహించుకు, ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు అందించే ఈ రుణాల లక్ష్యంపై డీఆర్‌డీఏ అధికారులు, సిబ్బంది ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే దృష్టి సారించారు. సంబంధిత అధికారులు ప్రతీ నెల సమీక్షలు నిర్వహిస్తూ సిబ్బందికి దిశానిర్దేశం చేయడం వల్ల జిల్లా రుణ లక్ష్యం నెరవేరింది. బ్యాంకు లింకేజీ ద్వారా అందజేసిన రుణాల్లో పలు మొండి బకాయిలున్నట్లు సంబంధిత వర్గాలు అంటున్నాయి. స్త్రీ నిధి రుణాల రికవరీ లక్ష్యం మేరకు జరగడం లేదంటున్నారు. రుణాల పంపిణీతో పాటు రివకరీ కోసం క్షేత్ర స్థాయిలో ఐకేపీ సిబ్బంది నిత్యం స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

-రఘువరన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

స్వయం సహాయక సంఘాల సభ్యులు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. 2024-25లో లక్ష్యం మేరకు రుణాలు అందించారు. ఈ ఏడాది తీసుకున్న రుణాలతో ఇందిరా మహిళాశక్తి పథకం కింద చాలా వ్యాపారాల యూనిట్లు నెలకొల్పారు. వీటి నిర్వహణ ద్వారా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. 2025-26లో సైతం రుణ లక్ష్యం నెరవేరేలా చర్యలు తీసుకుంటాం.

2024-25 సంవత్సరం మండలాల వారీగా రుణ పంపిణీ వివరాలు...(రూ.కోట్లలో)

--------------------------------------------------------------------------------

మండలం....................సంఘాలు...............రుణ లక్ష్యం................పంపిణీ

------------------------------------------------------------------------------------------------------------

ఇబ్రహీంపట్నం.....431.....................................29.13..................38.62

కొడిమ్యాల...............374.....................................41.72....................52.42

పెగడపల్లి................380.....................................44.93....................50.80

కథలాపూర్‌..............482.....................................41.74...................45.21

కోరుట్ల........................536.....................................55.06..................56.14

మల్యాల....................524.....................................46.22....................46.98

మల్లాపూర్‌...............647.....................................51.98.....................52.29

మేడిపల్లి...................690.....................................52.94.....................52.95

మెట్‌పల్లి...................413.....................................44.00.....................43.70

జగిత్యాల..................66.......................................9.92..........................9.71

ధర్మపురి...................367.....................................42.78.....................40.38

బుగ్గారం..................161.....................................21.45.....................19.98

రాయికల్‌.................564.....................................59.09.....................54.84

జగిత్యాల రూరల్‌ 525.....................................55.11.....................51.55

వెల్గటూరు...............456.....................................48.86.....................44.40

సారంగపూర్‌...........248.....................................29.31.....................29.30

గొల్లపల్లి.....................482.....................................68.85.....................56.43

బీర్‌పూర్‌.....................250....................................22.57.....................19.94

------------------------------------------------------------------------------------------------------------

మొత్తం......................7,596..................................765.67..................765.66

------------------------------------------------------------------------------------------------------------

Updated Date - May 14 , 2025 | 12:37 AM