నేడు కలెక్టరేట్‌లో మద్యం టెండర్ల డ్రా
ABN , Publish Date - Oct 27 , 2025 | 12:13 AM
జిల్లాలో 2025-27 మద్యం పాలసీలో వైన్స్‌లు కేటాయించేందుకు సర్వం సిద్ధమైంది.
సిరిసిల్ల క్రైం, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 2025-27 మద్యం పాలసీలో వైన్స్‌లు కేటాయించేందుకు సర్వం సిద్ధమైంది. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ఈనెల 27న సోమవారం ఉదయం 11 గంటలకు వైన్స్‌ల లక్కీ డ్రా తీసేందుకు ఎక్సైజ్‌శాఖ ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ డ్రా తీసి పేర్లు ప్రకటిస్తారు. జిల్లాలోని 48వైన్స్‌లకు 1381 దరఖాస్తులు రాగా, షాప్ నంబర్-1 నుంచి డ్రా ప్రారంభమవుతుంది. ఈవిధంగా సిరిసిల్ల పూర్తయిన తర్వా త వేములవాడ, ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్‌స్టేషన్‌ల వారీగా డ్రా తీసేం దుకు ఏర్పాట్లుచేశారు.
పోలీసు బందోబస్తు మధ్య డ్రా
కలెక్టరేట్ కార్యాలయంలో పోలీసు బందోబస్తు మధ్య లక్కీ డ్రా తీసేందుకు ఏర్పాట్లు చేశారు. లక్కీ డ్రాకు దాదాపు 1381 మంది దరఖాస్తుదారులతో పాటు స్నేహితులు, బంధువులు హాజరుకానున్నారు. ఇందుకోసం టెంట్లు, ఫర్నిచర్ సౌకర్యం కల్పిం చారు. మరోవైపు లక్కీ డ్రాలో వైన్స్‌లు రాని వారెవరైనా అనారోగ్యం పాలైతే చికిత్స అందించేందుకు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే తాగునీరు, టీ ఏర్పాటు చేశారు. కాన్ఫరెన్స్ హాలులో జరిగే డ్రా విధానం అనౌన్స్‌మెం ట్ వినిపించే విధంగా సౌండ్స్ విధానం ఏర్పాటుచేస్తున్నారు. అగ్నిప్ర మాదం సంభవించకుండా ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉంచుతారు.
ఎంట్రీ పాస్‌లు ఉంటేనే అనుమతి..
మద్యం షాప్‌లకు దరఖాస్తుచేసి ఎంట్రీ పాస్‌లు ఉన్న మద్యం వ్యాపారులను లోనికి అనుమతి ఇస్తారు. ఈ సమయంలో దరఖాస్తు దారులు లేనిపక్షంలో ఎవరికైతే అనుమతి పత్రం ఇస్తారో వారు లోనికి వెళ్లేందుకు వీలుంది. ఒక్కోసారి అయిదు షాప్‌ల దరఖాస్తుదారులను లోనికి అనుమతి ఇస్తారు.వ్యాపారులు ఎవరూ ఆడిటోరియంలోకి ఫోన్ తీసుకొని వెళ్లేందుకు అనుమతిలేదు. ప్రతి షాప్‌నకు దరఖాస్తు చేసిన మద్యం వ్యాపారుల హాజరు తీసుకొని అందరి సమక్షంలో డ్రా తీయడా నికి ఏర్పాట్లుచేశారు. ఎవరైనా దరఖాస్తు చేసి హాజరుకాని పక్షంలో వారి ప్రతినిధి రాకుంటే ఆ నంబర్ డ్రాలో వేయడానికి వీలుం డదు. ప్రతి షాప్ డ్రా ప్రక్రియను వీడియో చిత్రీకరిస్తారు.
చలాన్ తప్పనిసరి
వైన్స్‌లకు లక్కీ డ్రాలో అదృష్టం వరించిన వ్యాపారులు వెంటనే లైసె న్స్ ఫీజులో 6వ భాగం చెల్లించి చలాన్‌ను తప్పనిసరిగా అప్పగించాలి. బ్యాంకులో లైసెన్స్ ఫీజు చెల్లించిన చలాన్స్ ఎక్సైజ్ కార్యాలయంలో అందజేస్తే ఈనెల 31న వైన్స్‌ల లైసెన్సులు అందజేస్తారు. వ్యాపారులు డిసెంబరు 1నుంచి అమ్మకాలు ప్రారంభించుకోవచ్చు.